టైక్వాండో విజేతల ను అభినందించిన వైస్ చైర్మన్ వంశీధర్ .. సీఈఓ సుప్రియ
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఈనెల జరిగిన కర్నూల్ క్లబ్ లో కర్నూల్ డిస్ట్రిక్ట్ ఓపెన్ టైక్వాండో -2024 ఛాంపియన్షిప్ పోటీలో రవీంద్ర గ్లోబల్ స్కూల్ విద్యార్థులు పాల్గొని పథకాలు సాధించారు.ఈరోజు మంగళవారం ఉదయము టైక్వాండో పోటీలో పథకాలు సాధించిన విద్యార్థులకు వైస్ చైర్మన్ వంశీధర్ సర్టిఫికెట్లు మరియు పథకాలు అందజేశారు. ఆయన మాట్లాడుతూ మా విద్యార్థులు టైక్వాండో పోటీల్లో ఫైట్ విభాగంలో AG గ్రూప్ పాల్గొని పథకాలు సాధించడం జరిగింది.ఆత్మరక్షణ కొరకు టైక్వాండో,కరాటే లాంటి క్రీడలను సాధన చేయాలి అని చెప్పారు. ఈ పోటీలో 21 విద్యార్థులు పాల్గొనగా అందులో 3 గోల్డ్ ,12 సిల్వర్ ,6 బ్రాన్జ్ మెడల్స్ సాధించారు. విద్యార్థుల ఓంకార్, హర్షిత్, ఖ్యాతి, నితిన్, గణేష్, వసంత్ సుహాస్, వివేక్, నిక్షిత,నందన ,అనన్య, సాయి మాన్సి, విశాల్ ,మిథున్, మోక్షిత్ ,అనీష్ ను అభినదించారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ముంతాజ్, టీచర్స్, తల్లిదండ్రులు, పిటి శివ ,టైక్వా మాస్టర్లు టి అజయ్ పాల్గొన్నారు.