హొళగుందలో న్యూ ఇయర్ వేడుకలు
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద: హొళగుంద మండలంలో బుధవారం 2025 నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. మంగళవారం అర్ధరాత్రి నుంచి ప్రారంభ మైన ఈ వేడుకలు బుధవారమంతా యువకులు సంబరాల్లో మునిగి తేలారు. స్వీట్ షాపులు వద్ద జనం మూగబడ్డారు. యువకులు వీదుల్లో కేక్ కట్ చేసి వేడుకలను సంబరంగా జరుపుకున్నారు. కొత్త సంవత్సర శుభకాంక్షలు తెలిపి పాకెట్ క్యాలెండర్లను అందజేసారు. పలు పాఠశాలల్లో సాంకృతిక కార్యక్రమాలు జరిగాయి. చిన్నారులు, పెద్దలు, స్నేహితులు, బందువులు సెల్ఫోన్లు, మేయిల్స్, వాట్సాప్‌ల ద్వారా న్యూ ఇయర్ శుభకాంక్షలు చెప్పుకున్నారు. వేడుకల్లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండ ఎస్ఐ బాల ననసింహులు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.