కేంద్ర ప్రభుత్వ స్థాయిలో బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి
1 min readవై.నాగేశ్వరరావు యాదవ్ తెలుగుదేశం పార్టీ బీసీ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు
రాజమండ్రి లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్యవర్గ సమావేశం
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: జాతీయ బీసీ సంక్షేమ సంఘం యువజన సంగం అధ్యక్షులు లద్ధిక్ మల్లేష్ ఆధ్వర్యంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆఫీస్ లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర,జిల్లా నాయకులతో కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సమావేశంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై.నాగేశ్వరరావు యాదవ్ ,జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు నూకాలమ్మ ,నాగేశ్వరరావు, శ్రీనివాసరావు, లక్ష్మణ్ రావ్,బాబు,ఉన్మాన్ బిగ్, లీలావతి, సరోజిని, సూరి,ఉమాశంకర్, రామకృష్ణ, గోవింద్, శంకర్,నారాయణ మూర్తి,నక్క గోవింద రాజు,చంటి, సుబ్రమణ్యం మొదలైన జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు, బీసీ లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.ఈ సమావేశంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు మాట్లాడుతూ పి.జి. చేసే బి.సి. విద్యార్థులకు ఫీజు రియింబర్సుమెంట్ పథకం కొనసాగించాలి. ఇంతవరకు చట్ట సభలలో అడుగుపెట్టని కులాలకు పార్టీ పదవులలో, నామినేటెడ్ పదవులలో, యం.ఎల్.సి., రాజ్యసభలలో అవకాశం కల్పించాలి.పెరిగిన ధరలకు అనుగుణంగా హాస్టల్ విద్యార్థుల మెస్ చార్జీలు మరియు కాస్మిటిక్ చార్జీలు పెంచాలి.బి.యస్.ఎన్.ఎల్, యల్.ఐ.సి.లను ప్రవేటీకరణ చేయరాదు.