చేనేత ఉత్పత్తుల కొనుగోలు ద్వారా చేనేత రంగాన్ని ప్రోత్సహించండి
1 min readపల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు చేనేత కోపరేటివ్ సొసైటీ సంచార వాహనాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా చేనేత ఉత్పత్తుల కొనుగోలు ద్వారా చేనేత రంగాన్ని ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా విజ్ఞప్తి చేశారు. సోమవారం సునయన ఆడిటోరియం వద్ద చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు చేనేత కోపరేటివ్ సొసైటీ కి సంబంధించి చేనేత వస్త్రాలు కలిగిన సంచార వాహనాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. వాహనంలో ఉన్న పట్టు చీరలు, ఇతర చేనేత ఉత్పత్తులను కలెక్టర్ తిలకించి, వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చేనేత రంగాన్ని ప్రోత్సహించడం లో భాగంగా చేనేత ఉత్పత్తులను విక్రయించే సంచార వాహనాన్ని ప్రారంభించడం జరిగిందని తెలిపారు.. అధికారులు, ప్రజలు చేనేత ఉత్పత్తులను కొనుగోలు చేసి చేనేత కార్మికులకు అండగా నిలవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు..ఈ సంచార వాహనం చేనేత వస్త్రాలను విక్రయిస్తూ పలు ప్రాంతాల్లో పర్యటించనుందని కలెక్టర్ తెలిపారు..చేనేత జౌళి శాఖ సహాయ సంచాలకులు నాగరాజారావు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ సూచనల మేరకు సంచార వాహనాన్ని సునయన ఆడిటోరియం వద్ద కొద్దిసేపు ఉంచడం జరిగిందన్నారు..కలెక్టర్ అందించిన స్ఫూర్తితో మూడు గంటల్లో Rs. 41, 236/- చేనేత ఉత్పత్తుల్ని విక్రయించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి, డిఆర్ఓ సి వెంకటనారాయణమ్మ జౌలి శాఖ సహాయ సంచాలకులు నాగరాజా రావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.