PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

భ‌ర్తల సాయంతోనే.. సాధార‌ణ ప్రస‌వం..

1 min read

వారి నైతిక మ‌ద్ద‌తు గ‌ర్భవ‌తుల‌కు చాలా అవ‌స‌రం

కిమ్స్ క‌డ‌ల్స్ ఆస్పత్రి వైద్య నిపుణుల వెల్లడి

కిమ్స్ కడల్స్ గ‌చ్చిబౌలిలో ఘ‌నంగా మామ్ టు బి కార్నివాల్-2025

గ‌ర్భిణులు, వారి భ‌ర్తల‌తో విభిన్నమైన కార్యక్రమం

పల్లెవెలుగు వెబ్  హైద‌రాబాద్ : మ‌హిళ‌లు గ‌ర్భం దాల్చిన‌ప్పటి నుంచి వారి ప్రస‌వం అయ్యేవ‌ర‌కు, ఆ త‌ర్వాత కూడా వారికి భ‌ర్త‌ల నైతిక మ‌ద్దతు చాలా అవ‌స‌రం ఉంటుంద‌ని, అలా వారు అండ‌గా ఉంటేనే భార్యల‌కు సుల‌భంగా సాధార‌ణ ప్రస‌వం అవుతుంద‌ని గ‌చ్చిబౌలి కిమ్స్ క‌డ‌ల్స్ ఆస్పత్రికి చెందిన క‌న్సల్టెంట్ గైన‌కాల‌జిస్టులు, హైరిస్క్ ప్రెగ్నెన్సీ నిపుణులు తెలిపారు. గ‌ర్భం దాల్చిన‌ట్లు తెలిసిన‌ప్పటి నుంచి భ‌ర్తలు త‌మ భార్యల‌ను అనుక్షణం క‌నిపెట్టుకుని ఉండ‌డంతో పాటు.. వారికి అన్నిర‌కాలుగా మ‌ద్ద‌తుగా నిల‌వాల‌ని, వారిలో వ‌చ్చే మార్పుల‌ను జాగ్రత్తగా గ‌మ‌నించుకుంటూ.. అవ‌స‌ర‌మైన‌ప్పుడు వెంట‌నే ఆస్పత్రికి తీసుకెళ్లాల‌ని సూచించారు. గ‌చ్చిబౌలిలోని కిమ్స్ క‌డ‌ల్స్ ఆస్పత్రిలో ఆదివారం సాయంత్రం “మామ్ టు బి కార్నివాల్-2025” అనే కార్యక్రమం వైభ‌వంగా జ‌రిగింది. దాదాపు ఆరు నెల‌ల గ‌ర్భం ఉన్న 60 మంది మ‌హిళ‌లు, వారి భ‌ర్తలు సంయుక్తంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడంతో ప్రాంగ‌ణ‌మంతా సంద‌డిగా మారింది.

సాధార‌ణ ప్రస‌వాల‌కు ప్రోత్సాహం

“ఇటీవ‌లి కాలంలో అవ‌స‌రం ఉన్నా, లేక‌పోయినా సిజేరియ‌న్లు చేసేస్తున్నారు. ఇందులో అటు వైద్యుల పాత్ర‌, ఇటు గ‌ర్భిణుల భ‌ర్త‌లు, ఇత‌ర బంధువుల పాత్ర కూడా ఉంటోంది. నొప్పులు భ‌రించ‌లేర‌న్న భ‌యంతోనో, లోప‌ల బిడ్డ న‌లిగిపోతుంద‌న్న ఆందోళ‌న‌తోనో ఎందుకొచ్చిన ఇబ్బంద‌ని కొంద‌రు సిజేరియ‌న్ చేయాల‌ని అడుగుతున్నారు. మ‌రికొంద‌రైతే ఫ‌లానా ముహూర్తానికే త‌మ బిడ్డ పుట్టాల‌ని కోరుకుంటూ, ఆ స‌మ‌యానికి పుట్టేలా సిజేరియ‌న్ చేయ‌మ‌ని కోరుతున్నారు. ఇవ‌న్నీ స‌రికాదు. మ‌హిళ ఆరోగ్యం దృష్ట్యా చూసినా, పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం దృష్ట్యా చూసినా సాధార‌ణ ప్రస‌వ‌మే మంచిది. ఒక‌వేళ లోప‌ల బిడ్డ అడ్డం తిరిగినా, వేరే వైద్యప‌ర‌మైన ఇబ్బందులు ఏమైనా ఉన్నా అప్పటిక‌ప్పుడు మేమే నిర్ణ‌యం తీసుకుని సిజేరియ‌న్ చేస్తాం. వైద్యప‌ర‌మైన స‌మ‌స్యలు ఏమీ లేనంత‌వ‌ర‌కు సాధార‌ణ ప్రస‌వమే మంచిది” అని వైద్యులు సూచించారు. “మామ్ టు బి కార్నివాల్-2025” కార్యక్రమంలో భాగంగా మ‌హిళ‌లు గ‌ర్భం దాల్చిన‌ప్పటి నుంచి ప్రస‌వం వ‌ర‌కు, ఆ త‌ర్వాత కూడా తీసుకోవ‌ల్సిన పోష‌కాహారం గురించి, చేయాల్సిన వ్యాయామాల గురించి, పిల్ల‌ల‌కు పాలు ప‌ట్టే నైపుణ్యాల గురించి వారికి స‌మ‌గ్రంగా వివ‌రించారు. కిమ్స్ కడల్స్ గచ్చిబౌలిలో సాధారణ ప్రసవాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. క్లిష్టమైన ప్రసవాల సౌకర్యం ఉంది మరియు డెలవరీ సమయంలో ఎక్కువగా రక్తంస్రావం అయినప్పుడు గర్భసంచి తొలగించాల్సి అవసరం లేకుండా (యూట్రైన్ ఆర్ట్రీ ఎంబోలైజేషన్) పద్దతితో గర్భసంచిని కాపాడే అవకాశం ఉంది. అంతేకాకుండా నెలల నిండకుండా పుట్టిన పిల్లలను రక్షించడానికి లెవల్ ఫోర్ ఎన్ఐసియుల సౌకర్యం ఉంది. ఇక్కడ 700 గ్రాముల కంటే తక్కువ బరువుతో పుట్టిన శిశువులను విజయవంతంగా చికిత్సనందించి కాపాడారు. ఈ కార్యక్రమాన్ని క‌న్సల్టెంట్ గైన‌కాల‌జిస్టు, ఆబ్స్టెట్రీషియ‌న్‌, లాప్రోస్కొపిక్ స‌ర్జన్ డాక్టర్ డి.ఎస్. నిఖితారెడ్డి, డా. కావ్యప్రియ వజ్రాల డా. సాహితీ బల్మూరి, ఆధ్వర్యంలో నిర్వహించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *