హోలగుంద నుండి డనాపురం వరకు రోడ్డు సౌకర్యం కల్పించండి..
1 min readజెండా ఊపి పాదయాత్రను ప్రారంభించిన జిల్లా అధ్యక్షులు పరిగెల మురళికృష్ణ…
ఆదోని సబ్ కలెక్టర్ కి వినతి పత్రం అందించిన ఇండియా కూటమి నాయకులు…
పల్లెవెలుగు వెబ్ హొళగుంద : ఆలూరు నియోజకవర్గం హోళగుంద మండలం హెబ్బటం గ్రామం నుండి ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు హోళగుంద నుండి డనాపురం 20 కిలో మీటర్ల వరకు రోడ్డు సౌకర్యము కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆలూరు కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ చిప్పగిరి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో తలపెట్టిన ఒక్క రోజు పాదయాత్రలో ముఖ్య అతిథిగా హాజరైన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పరిగెల మురళికృష్ణ జెండా ఊపి పాదయాత్రను ప్రారంభించారు.ఈ సందర్భంగా పరిగెల మురళికృష్ణ మీడియాతో మాట్లాడుతూ మనకు స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని సంవత్సరాలయినా రోడ్లు కోసం పోరాటాలు చేస్తున్నామని కనీసం ప్రభుత్వ అధికారులు రోజు ఈ రోడ్డు గుండా ప్రయాణాలు చేస్తున్నారని వారికి చిమకుట్టినట్టు కూడా లేదని రోడ్డు నిర్మాణం కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేసిన కాంట్రాక్టరు ఎందుకు పనులు చేయలేదని ప్రశ్నించారు. ఆలూరు కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ చిప్పగిరి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రోడ్డు నిర్మాణం కోసం ప్రభుత్వం తక్షణమే నిధులు విడుదల చేసి హోలగుంద మండల ప్రజలు, రైతులు, విద్యార్థులు జీవితాలను కాపాడాలని రోడ్డు ప్రమాదలను అరికట్టాలని కనీసం గర్భిణీ స్త్రీలు ఆదోని హాస్పిటల్ కు పోవాలంటే అంబులెన్సులు రాని పరిస్థితులు నెలకొన్నాయని, పాదయాత్రలో పాల్గొని విజయవంతం చేసిన కాంగ్రెస్ పార్టీ సిపిఎం సిపిఐ ఎమ్మార్పీఎస్ విద్యార్థి సంఘాల నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.సిపిఎం నాయకులు హనుమంతు, నారాయణ స్వామి మాట్లాడుతూ రోడ్డు నిర్మాణం కోరకు పాదయాత్రతో ఆగిపోదని రాబోయే రోజుల్లో ప్రభుత్వం స్పందించకపోతే నిరసన, నిరాహార దీక్షలకు దిగుతామని హెచ్చరించారు.ఎమ్మార్పీఎస్ నాయకులు గూల్యం యల్లప్ప , హోళగుంద వెంకటేష్ మాట్లాడుతూ రోడ్డు పనులు ప్రారంభించి చదువుకుంటున్న విద్యార్థులు, యువతను సామాన్య మధ్యతరగతి ప్రజలను ఆదుకోవాలని కోరారు. అనంతరం సబ్ కలెక్టర్ మౌర్య భరత్వాజ్ కువినతి పత్రాన్ని అందించారు. సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ నాయకులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసికెళ్ళి రోడ్డు సౌకర్యము కల్పిస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ, సిపిఎం, సిపిఐ, ఎమ్మార్పీఎస్, విద్యార్ది సంఘం నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.