జనవరి 1వ తేదీ నుండి ఫిబ్రవరి 28వ తేదీ వరకు లైఫ్ సర్టిఫికెట్లు స్వీకరణ
1 min readజిల్లా ఖజానా శాఖ అధికారి టి కృష్ణ
మీసేవ,ఇంటర్నెట్ సెంటర్ల ద్వారా నిర్దేశించిన గడువులోగా సమర్పించాలి
పల్లెవెలుగు వెబ్ ఏలూరుజిల్లా ప్రతినిధి: ఏలూరు జిల్లాలో సర్వీస్ పెన్షనర్లు మరియు కుటుంబ పెన్షనర్లు అందరూ 2025 సంవత్సరానికి చెందిన వార్షిక ధ్రువీకరణ పత్రాలు (లైఫ్ సర్టిఫికెట్) జనవరి 1, 2025 నుండి ఫిబ్రవరి 28 వరకు జిల్లా నందలి ఖజానా కార్యాలయముల నందు స్వీకరించుట జరుగుతుందని శనివారం జిల్లా ఖజానా మరియు లెక్కల శాఖాధికారి టి. కృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. కావున పింఛనుదారులు అందరూ వారికీ సమీపం లోని ఖజానా కార్యాలయం, మీ సేవ కేంద్రాలు, బ్యాంకులు, ఇంటర్నెట్ సెంటర్ల లో వారి యొక్క వార్షిక ధ్రువీకరణ పత్రాలు (లైఫ్ సర్టిఫికెట్) నిర్దేశించిన గడువు లోగా సమర్పించాలన్నారు. ఈ విషయంలో ఏదైనా సమస్యలు, ఇబ్బందులు ఉన్నచో, పింఛనుదారులు సంబంధిత ఖజానా అధికారుల దృష్టికి తీసుకుని రావాలని ఆయన తెలిపారు.