ఐటీసీ కంపెనీపై చర్యలు తీసుకోవాలి : సీపీఎం
1 min readపల్లెవెలుగు వెబ్ మిడుతూరు (నందికొట్కూరు): రైతులను నమ్మించి మోసం చేస్తున్న ఐటీసీ కంపెనీ వారిపై చర్యలు తీసుకోవాలని సీపీఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం నాగేశ్వరావు డిమాండ్ చేశారు.మంగళవారం మిడుతూరు రహదారిలో ఉన్న పంచముఖి వేర్ హౌస్ గోడౌన్ లో ఐటీసీ కంపెనీ కొనుగోలు చేస్తున్న పొగాకును సిపిఎం నాయకులు పరిశీలించారు.ఈ సందర్భంగా నాగేశ్వర రావు మాట్లాడుతూ గత సంవత్సరం సుక్క బార్లీ పొగాకు భారీ డిమాండ్ తో కొనుగోలు చేయడంతో రైతులు ఎంతో ఆశతో ఈ సంవత్సరం శనగ, కంది,మొక్కజొన్న పంటలు వేయకుండా పెద్ద ఎత్తున సుక్కబర్రి పొగాకును రైతులు సాగు చేశారు.ఈ పంటలకు ఎంతో ఖర్చు చేసి పంటలు సాగు చేశారని ఐటిసి కంపెనీ దగ్గరకు పొగాకును అమ్మేందుకు తీసుకుపోగా రైతులకు నిరాశ ఉంటుందని క్వింటం 15,500 కొనుగోలు చేస్తామని అగ్రిమెంట్ చేసుకుని పొగాకు నాణ్యత లేదని పేరుతో 12,000 నుండి 15వేల వరకు కొనుగోలు చేస్తున్నారని దామగట్ల గ్రామానికి చెందిన జావేదు 16 బేళ్లు తీసుకొని వస్తే ఒక్కటి మాత్రమే కొనుగోలు చేసి 15 బేళ్లను వెనక్కి పంపించారని అన్నారు. ప్రతి రోజూ పొగాకు నాణ్యత లేదనే పేరుతో అనేక మంది రైతుల పొగాకును వెనక్కి పంపుతున్నారని అన్నారు.ఐటీ కంపెనీ వారితో మాట్లాడడం జరిగింది.ఈ కార్యక్రమంలో రైతులు జగదీశ్వర్ రెడ్డి,ఉస్మాన్ భాష, వలిభాష,శంకర్,మహేష్,నాగ స్వామి పాల్గొన్నారు.