PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రెండేళ్ల బాలుడికి అసాధార‌ణంగా పెరిగిన కిడ్నీ

1 min read

4 సెంటీమీట‌ర్లు ఉండాల్సింది 20 సెం.మీ. స్థాయికి!

మూత్రనాళాలు మూసుకుపోయి పొట్ట‌లో చేరిన నీరు

గ‌ర్భస్థ శిశువుగా ఉండగానే మొద‌లైన స‌మ‌స్య‌

పూర్తిగా ప‌నిచేయ‌కుండా పోయిన ఎడ‌మ కిడ్నీ

క‌ర్నూలు కిమ్స్‌లో లాప్రోస్కొపిక్ ప‌ద్ధతిలో తొల‌గింపు

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  రెండేళ్ల వ‌య‌సున్న బాలుడికి క‌డుపు మొత్తం ఒక‌వైపు ఉబ్బిపోయి, తీవ్రమైన నొప్పితో బాగా ఇబ్బంది ప‌డుతున్నాడు. ఒక కిడ్నీ పూర్తిగా ప‌నిచేయ‌కుండా పోవ‌డంతో పాటు అది అసాధార‌ణంగా పెరిగిపోవ‌డం వ‌ల్లే ఈ స‌మ‌స్య ఏర్ప‌డింది. ఆ బాలుడికి చికిత్స చేసిన క‌ర్నూలు కిమ్స్ ఆస్పత్రికి చెందిన యూరాల‌జీ విభాగాధిప‌తి, సీనియ‌ర్ క‌న్స‌ల్టెంట్ యూరాల‌జిస్టు, ఆండ్రాల‌జిస్టు, సంతాన‌సాఫ‌ల్య నిపుణుడు డాక్ట‌ర్ వై.మ‌నోజ్ కుమార్ ఇందుకు సంబంధించిన వివ‌రాల‌ను మీడియాకు తెలిపారు. “క‌ర్నూలు ప్రాంతానికి చెందిన రెండేళ్ల బాలుడికి పుట్టక ముందునుంచే, అంటే గ‌ర్భస్థ శిశువుగా ఉండ‌గానే స‌మ‌స్య ఉంది. అత‌డి ఎడ‌మ కిడ్నీ ప‌నిచేయ‌డం లేదు. దానికితోడు సాధార‌ణంగా రెండేళ్ల వ‌య‌సులో అంటే కిడ్నీ ప‌రిమాణం 4 సెంటీమీట‌ర్లు ఉండాలి. కానీ అది అసాధార‌ణంగా పెరిగిపోయి 20 సెంటీమీట‌ర్ల స్థాయికి చేరుకుంది. అది మూత్రనాళాన్ని కూడా నొక్కేయ‌డంతో అవి మూసుకుపోయాయి. దానివ‌ల్ల నీరంతా పొట్ట‌లోకి చేరి పొట్ట ఒక‌వైపు బాగా ఉబ్బిపోయి, బాలుడికి క‌డుపునొప్పి తీవ్రంగా వ‌చ్చేది. అత‌డి త‌ల్లిదండ్రులు ముందుగా ఒక ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లి, అక్కడి వైద్యుల సూచ‌న మేర‌కు కిమ్స్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఇక్కడ అవ‌స‌ర‌మైన ప‌రీక్షల‌న్నీ చేసిన త‌ర్వాత‌.. ప‌నిచేయ‌కుండా, ఇబ్బంది పెడుతున్న కిడ్నీని తొల‌గించ‌డ‌మే మంచిద‌ని నిర్ణయించాం. అయితే బాలుడి వ‌య‌సు రెండేళ్లు మాత్రమే కావ‌డంతో ఓపెన్ స‌ర్జరీ కాకుండా లాప్రోస్కొపిక్ ప‌ద్ధతిలో చేయాల‌ని భావించాం. కేవ‌లం ఒక‌టి, ఒక‌టిన్నర సెంటీమీట‌ర్ల మేర చిన్న కోత‌లు మాత్రమే పెట్టి. వాటి ద్వారా పాడైన కిడ్నీ మొత్తాన్ని తొల‌గించాం. దానికిముందు పొట్ట‌లో చేరిన నీటిని తీసేశాం. ఇప్పుడు ఉన్న ఒక్క కిడ్నీ బాగా ప‌నిచేస్తోంది. దాంతో బాలుడికి మూత్రవిస‌ర్జ‌న సాధార‌ణంగా అవుతోంది. శ‌స్త్రచికిత్స చేసిన రెండోరోజే బాలుడిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశాం. ఈ బాబుకు ఒక్కటే కిడ్నీ ఉన్నా వ‌చ్చిన ఇబ్బందేమీ లేదు. ఆడుకోవ‌చ్చు, స్కూలుకు వెళ్లొచ్చు, అన్ని ప‌నులూ చేసుకోవ‌చ్చు. అయితే పెద్దవ‌య‌సు వ‌చ్చిన త‌ర్వాత బీపీ, మ‌ధుమేహం లాంటివి ఏమైనా వ‌స్తే మాత్రం సాధార‌ణ వ్యక్తుల కంటే ఇలాంటి వారికి ముప్పు ఎక్కువ‌గా ఉంటుంది. అందువ‌ల్ల అలాంటి ప‌రిస్థితుల విష‌యంలో జాగ్రత్తగా ఉండాలి” అని డాక్టర్ వై.మ‌నోజ్ కుమార్ వివ‌రించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *