ప్రభుత్వ స్థలాన్ని అమ్మిన వ్యక్తిపై కేసు నమోదు చేయాలి..
1 min readమున్సిపాలిటీ కమిషనర్ కు సీపీఎం వినతి
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి ఇతరులకు అమ్మిన వ్యక్తిపై కేసు నమోదు చేయాలని సీపీఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం నాగేశ్వరరావు అన్నారు.వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ నంద్యాల జిల్లా నందికొట్కూరు మున్సిపాలిటీ కమిషనర్ ఎస్ బేబీ కి బుధవారం మధ్యాహ్నం సీపీఎం నాయకులు గోపాలకృష్ణ,ఉస్మాన్ భాష,బాలస్వామి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా నాగేశ్వర రావు మాట్లాడుతూ నందికొట్కూరు మున్సిపాలిటీ మిడుతూరు రహదారిలో 2013 లో 20 ఎకరాల్లో ప్యారడైజ్ పేరుతో వెంచర్ వేసి డీటీసీపీ లే ఔట్ వేసి 264 ప్లాట్లు వేసి ఇతరులకు అమ్ముకున్నారని ప్రజల అవసరాల కోసం పబ్లిక్ స్థలాన్ని కూడా అమ్ముకొని రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు వారు తెలిపారు.20 రోజులు అవుతున్నా కూడా వారిపై చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు.ప్యారడైజ్ స్థలంలో జరిగిన అవినీతిపై విచారణ చేసి బాధ్యులపై కేసు నమోదు చేయాలని లేనియెడల మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట ఆందోళన చేపడుతామని అన్నారు.మున్సిపాలిటీలో అనేక మంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ప్రభుత్వా నిబంధనలకు విరుద్ధంగా విచ్చలవిడిగా వెంచర్లు వేసి ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు.మున్సిపాలిటీలో వేసిన వెంచర్ల అన్నింటినీ సిపిఎం బృందం పర్యటించి సర్వే చేపట్టి నివేదికను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని అన్నారు.