పిటిడబ్య్లూతో ఒప్పందం కుదర్చుకున్న బార్ట్రానిక్స్
1 min readభారత్‌లో సెమీకాన్ ఇన్నోవేషన్లకు కొత్త గమ్యం
పల్లెవెలుగు వెబ్ హైదరాబాద్ : బార్ట్రానిక్స్ ఇండియా లిమిటెడ్ (బిఎస్ఈ: 532694, ఎన్ఎస్ఈ, ఎఎస్ఎంఎస్) మరియు సింగపూర్‌కు చెందిన పిటిడబ్ల్యూ గ్రూప్ మధ్య సరికొత్త ఒప్పందం కుదిరింది. భారత్‌ను గ్లోబల్ సెమీకండక్టర్ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యానికి ఇది కీలకమైన ముందడుగుగా నిలుస్తుంది. తెలంగాణ ఐటీ మంత్రితో సమావేశం అనంతరం ఈ ఒప్పందం హైదరాబాద్‌లో కుదిరింది.ఈ ఒప్పందంతో పిటిడబ్ల్యూ గ్రూప్ భారత మార్కెట్లో ప్రవేశించనుంది. భారత్‌లో సెమీకాన్ ఫ్యాబ్స్ ఏర్పాటు, ఉత్పత్తి సామర్థ్యాలను అభివృద్ధి చేయడం, సెమీకాన్ పరికరాల రిఫర్బిష్మెంట్తో పాటు సెమీకండక్టర్ తయారీ, శిక్షణా కార్యక్రమాలను నిర్వహించడమే ప్రధాన లక్ష్యంగా ఉంది.పిటిడబ్ల్యూ గ్రూప్ 14 దేశాల్లో కార్యకలాపాలతో ప్రపంచవ్యాప్తంగా 700కి పైగా ఫ్యాబ్స్‌కు ‘అప్రూవ్డ్ వెండర్’గా గుర్తింపు పొందింది. టిఎస్ఎంసి, సామ్సంగ్, సోనీ, మైక్రాన్, టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ వంటి గ్లోబల్ లీడర్స్‌కు ఈ సంస్థ సేవలు అందిస్తోంది.ఈ ఒప్పందంపై పిటిడబ్ల్యూ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ టోర్స్టెన్ సీఫ్రైడ్ మాట్లాడుతూ, “భారత్‌లో సెమీకాన్ పరికరాల తయారీకి అనేక అవకాశాలు ఉన్నాయి. బార్ట్రానిక్స్తో భాగస్వామ్యం ద్వారా మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ముందడుగు వేస్తాము” అన్నారు.బార్ట్రానిక్స్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ న. విద్యాసాగర్ రెడ్డి మాట్లాడుతూ, “భారత్‌లో సెమీకాన్ రంగంలో ఇన్నోవేషన్లకు ఈ ఒప్పందం దోహదపడుతుంది. ఆర్&డి, శిక్షణ, లోకల్ మాన్యుఫాక్చరింగ్‌కు మద్దతుగా నిలుస్తుంది” అన్నారు.ఈ ఒప్పందం సెమీకాన్ రంగంలో భారత్‌కు ఆర్థిక, సాంకేతిక పురోగతికి కీలక భూమికగా నిలుస్తుందని అంచనా.