చేనేత కార్మికులకు అండగా కూటమి ప్రభుత్వం
1 min readఎన్ హెచ్ డి సి. వారి నూలు పాస్ పుస్తకాల పంపిణీ & విద్యుత్ చార్జీల రాయితీ గుర్తింపు పత్రాల ప్రదానం
పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు : పట్టణంలోని తేరుబజార్ నందు చేనేత కార్మికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం వత్తాసు అందిస్తూ, నూలు పాస్ పుస్తకాలు మరియు విద్యుత్ చార్జీల రాయితీ గుర్తింపు పత్రాలను అందజేయడం ద్వారా వారి జీవితాల్లో వెలుగులు, అభివృద్ధి మరియు ఆర్థిక భద్రతను కలిగించేందుకు కృషి చేస్తుందని ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో హ్యాండ్లూమ్స్ అధికారులు అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ నాగరాజు ,అప్పాజీ ఏ డి వో. పెద్దయ్య చేనేత కార్మికులు, వార్డు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.