పీరు సాహెబ్ పేటలో ‘పొలం పిలుస్తోంది’..
1 min readపల్లెవెలుగు వెబ్ మిడుతూరు (నందికొట్కూరు): నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని పీరు సాహెబ్ పేట గ్రామంలో బుధవారం మిడుతూరు మండల వ్యవసాయ అధికారి ఏం పేరు నాయక ఆధ్వర్యంలో ‘పొలం పిలుస్తోంది’అనే కార్యక్రమం కార్యాక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏవో మరియు సిబ్బంది గ్రామంలో వేసిన శనగ మరియు తదితర పంటల గురించి వారు పొలానికి వెళ్లి పంటల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రైతులకు ఏవో వివరించారు.రైతులకు ప్రస్తుత పంటలపై వచ్చే చీడ పీడలపై రైతులకు అవగాహన కల్పించారు.అదే విధంగా రైతులు కంది విత్తనాలు ప్రభుత్వమే మద్దతు ధరకు రైతుల వద్ద నుండి కొనడం జరుగుతుందని కావునా రైతులు తొందరపడి దళారులకు తక్కువ ధరకు అమ్ము కోవద్దని రైతులకు సూచించారు.ఈ కార్యక్రమంలో విస్తరణ అధికారి అశోక్,విహెచ్ఏ చంద్రకళ,ఎంపీఈఓ అశోక్ మరియు రైతులు పాల్గొన్నారు.