PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బీసీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి రుణాల మంజూరుకు దరఖాస్తుల ఆహ్వానం

1 min read

అవసరమైన, అర్హత గల వ్యక్తులకు మాత్రమే రుణాలు మంజూరు చేయండి

బ్యాంకర్లను సూచించిన జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా

పల్లెవెలుగు వెబ్ నంద్యాల: జిల్లాలోని బీసీ, ఈబీసీ వర్గాలకు చెందిన ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు స్వయం ఉపాధి రుణాలు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి బ్యాంకర్లను సూచించారు. బుధవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో బీసీల స్వయం సమృద్ధి రుణాల మంజూరుపై బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. బీసీ కార్పొరేషన్ ఈడీ జాకీర్ హుస్సేన్, ఎల్డిఎం రవీంద్ర కుమార్, యూబీఐ డిప్యూటీ రీజినల్ మేనేజర్ సురేంద్ర గౌడ్, ఎస్బిఐ చీఫ్ మేనేజర్ మనోహర్, బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ మేనేజర్ సుందర రాము తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ 2024 -25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బిసి, ఈ బీసీ వర్గాలకు వ్యవసాయం, రవాణా, పరిశ్రమలు, ఎలక్ట్రానిక్ సర్వీసులు, చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుని ఆర్థికంగా స్థిరపడేందుకు ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల మేరకు మేరకు రుణాలు మంజూరు చేయాలని బ్యాంకర్లను సూచించారు. జిల్లాలో 2156 మంది బీసీలకు 45.84 కోట్ల రూపాయలను వివిధ పథకాల కింద రుణాలను అందించాలన్నారు. అలాగే  ఈబీసీ  వర్గాల 73 యూనిట్లకు 1.27 కోట్లు , కమ్మ కార్పొరేషన్ క్రింద 15 యూనిట్లకు 26 లక్షలు, రెడ్డి కార్పొరేషన్ కింద 45 యూనిట్లకు 78 లక్షలు, ఆర్యవైశ్య కార్పొరేషన్ ద్వారా 26 యూనిట్లకు 45 లక్షలు, బ్రాహ్మిన్ కార్పొరేషన్ కింద్ 10 యూనిట్లకు 17 లక్షల మేర స్వయం ఉపాధి రుణాలు అందించేందుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామన్నారు. వీటన్నింటినీ పరిశీలించి అవసరమైన, అర్హత గల వ్యక్తులకు మాత్రమే రుణాలు మంజూరు చేయాలన్నారు. రుణాల మంజూరులో ఎలాంటి అవకతవకలకు పాల్పడకుండా ఖచ్చితమైన లబ్ధిదారులకే మంజూరు చేసేందుకు శ్రద్ధ తీసుకోవాలన్నారు. 21 నుండి 60 సంవత్సరాల లోపు ఉన్న బీసీ వర్గాల వారు రేషన్ కార్డు, ఆధార్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రాలతో ఆన్లైన్లో ఏపీఓబిఎంఎంఎస్ వెబ్సైట్లో ఈనెల16వ తేదీలోగా అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తిచేసి జిల్లాను టాప్ ఫైవ్ లో ఉంచాలన్నారు. లక్ష్యానికి మించి దరఖాస్తులు వస్తే స్క్రూటినీ చేసి అర్హత గల వ్యక్తులకే రుణాల మంజూరుకు చర్యలు తీసుకోవాలన్నారు.మహాశివరాత్రి, ఉగాది బ్రహ్మోత్సవాల సందర్భంగా పాదయాత్ర ద్వారా శ్రీశైలం వెళ్లే భక్తుల దారుల్లో గిరిజనులు చిన్నచిన్న వ్యాపారాలు చేసుకునేందుకు రుణాలు కల్పించాలని కలెక్టర్ బ్యాంకర్లను సూచించారు. గత సంవత్సరం 30 యూనిట్లకు రుణాలు ఇచ్చారని ఈ విడత మరింత ఎక్కువ మందికి రుణాలు కల్పించేందుకు ప్రత్యేక చొరవ చూపాలని బ్యాంకర్లను సూచించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *