గుర్తింపు కార్డులు పొందిన కౌలురైతులకు హామీలేని పంట రుణాలు మంజూరు చేయాలి
1 min readఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. జమలయ్య
వ్యవసాయశాఖ జెడి హబీబ్ భాషా కి వినత పత్రం అందజేసిన ఏపీ కౌలు రైతుల సంఘం నాయకులు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి: జిల్లాలో గుర్తింపు కార్డులు పొందిన కౌలు రైతులకు హామీలేని రుణాలు మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. జమలయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం ఏలూరు జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం ఏలూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలు పాల్గొన్న జమలయ్య మాట్లాడుతూఏలూరు జిల్లాలో 70 నుండి 80 శాతం మంది కౌలురైతులే పంటలు పండిస్తున్నారన్నారు.బ్యాంకులు వీరికి పంట రుణాలు మంజూరులో సహకరించడం లేదని ఆరోపించారు.ఇటీవల కాలంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హామీ లేని పంట రుణాలు ప్రతి ఒక్కరికి రూ.1.60లక్షల నుండి రూ.2 లక్షల వరకు పంట రుణాలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారని తెలిపారు.ఆర్.బి.ఐ ఆదేశాలను అనుసరించి పంటలు రుణాలు ఉదారంగా ఇవ్వాలని, రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులను కోరిన విషయాన్ని పేర్కొన్నారు. వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి బి. రాజశేఖర్, వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఎస్. ఢిల్లీ రావు కూడా బ్యాంకర్స్ సమావేశం జరిగినప్పుడు కౌలు రైతులకు పంటలు రుణాలు ఇచ్చేందుకు సత్వర చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారని తెలిపారు.ఇటీవల అమరావతి సచివాలయంలో వ్యవసాయ శాఖ,బ్యాంక్ అధికారులు కౌలురైతు సంఘాల ప్రతినిధులతో సమీక్షా సమావేశం కూడా నిర్వహించారని,ఆ సమావేశంలో కూడా తనఖా రహిత రుణాలు మంజూరు చేయటానికి ప్రాధాన్యత నివ్వాలని తీర్మానం చేశారు అన్నారు.ప్రస్తుతం ఏలూరు జిల్లాలో ముసునూరు మండలం వలసపల్లి గ్రామంలో 70 మంది కౌలురైతులు గుర్తింపు కార్డులు కలిగి ఉన్నారని,స్థానిక బ్యాంక్ లో అధికారులను కలిస్తే ఇద్దరుకిస్తామని రకరకాల ఆంక్షలు పెడుతున్నారని విమర్శించారు. చింతలపూడి మండలం రేచర్ల, మల్లయ్యగూడెం గ్రామానికి సంబంధించిన కౌలు రైతులు కూడా పంట రుణాలు ఇవ్వాలని స్థానిక బ్యాంక్ అధికారులకు వినతి పత్రాలు ఇచ్చిన కనీస స్పందన లేదన్నారు. వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ జోక్యం చేసుకొని కౌలు గుర్తింపు కార్డులు పొందిన వారికి తనఖా రహిత పంట రుణాలు మంజూరు చేసే విధంగా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. డబల్ ఫైనాన్స్ సమస్య వస్తే గుర్తింపు కార్డులు పొందిన లేదా పొందకపోయినా వాస్తవ కౌలురైతులను గుర్తించి వారితో జాయింట్ లయబులిటీ గ్రూపులు ఏర్పాటు చేసి పంటరుణాలు ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. రబీలోలోనైనా పంటల వేసిన కౌలు రైతులను గుర్తించి గ్రామాల వారిగా లిస్టు తయారుచేసి బ్యాంక్ అధికారులతో మాట్లాడి రుణాలు మంజూరు చేసే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. అనంతరం వ్యవసాయ శాఖ జెడి కి వినతి పత్రం అందజేశారు. ఈ ధర్నాలో రైతు సంఘం జిల్లా నాయకులు, సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి రాయంకుల లక్ష్మణరావు, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి దొంత కృష్ణ, రైతు, కౌలు రైతు సంఘాల నాయకులు మధు,కృష్ణ, చెంగల వెంకటేశ్వరరావు,కొక్కిరపాటి ఆనంద్, తదితరులు పాల్గొన్నారు.