ఇంటర్నేషనల్ యూత్ కల్చరల్ ఫెస్టివల్ నిర్వహించడం కర్నూలుకి గర్వకారణం
1 min read-మాజీ రాజ్యసభ సభ్యులు టిజి వెంకటేష్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: సౌత్ ఏసియా పేస్ కాన్ఫరెన్స్ మరియు ఇంటర్నేషనల్ యూత్ కల్చరల్ ఫెస్టివల్ ఇక్కడ జరగడం కర్నూలు నగరానికే గర్వకరణమని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. టీజీవి ఫైన్ ఆర్ట్స్ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా నగర శివారులో ఉన్న మాంటిస్సోరి ఇండస్ స్కూల్ నందు ఈ కార్యక్రమాన్ని టీజీ వెంకటేష్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతి పరిరక్షణ కోసం వివిధ దేశాల నుంచి ప్రతినిధులు రావడం ఆనందంగా ఉందన్నారు. వివిధ ప్రాంతాల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ యువతలో చైతన్యాన్ని కల్పిస్తూ, సమైక్యత భావాన్ని పెంపొందించడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా లాంగ్వేజ్ ఎక్స్చేంజ్, కల్చరల్ ఎక్స్చేంజ్, సాంస్కృతిక ప్రదర్శనలు మరియు శాంతి సందేశాలతో కూడిన క్లాసులని వినియోగించుకొని దేశానికి దేశ భవిష్యత్తుకు యువత ఉపయోగపడాలన్నారు. మూడు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొనే యువత సద్భావన, సత్ సంప్రదాయాలతో విలువైనటువంటి సంస్కృతిని నేర్చుకోవాలని టీజీ వెంకటేష్ కోరారు. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, ప్రపంచ శాంతికి మేము సైతం అంటూ వారు ఎల్లప్పుడూ ముందు ఉండి శాంతికి తోడ్పడుతారని ఆశిస్తున్నట్టు టీజీ వెంకటేష్ అన్నారు.ఈ కార్యక్రమంలో మాంటిస్సోరి విద్యాసంస్థల డైరెక్టర్ రాజశేఖర్,, ఢిల్లీ పార్లమెంటులో మీడియా ఆర్గనైజర్ కీర్తి,, గోపాల్,, రాజీవ్, గౌరీ తదితరులు పాల్గొన్నారు.