రెండవ రోజు కొనసాగిన నేషనల్ జూనియర్ రోల్ బాల్ పోటీలు
1 min readపల్లెవెలగు వెబ్ కర్నూలు: స్థానిక రిడ్జ్ పాఠశాలలో నిన్నటి నుండి జరుగుతున్న నేషనల్ జూనియర్ రోల్ బాల్ పోటీలు విజయవంతంగా జరుగుతూ ఉన్నాయి. దేశంలోని మొత్తం 20 రాష్ట్రాల నుండి వచ్చిన జట్లు ఒక జట్టుపై ఒకరు ఎంతో నైపుణ్యంతో ధృడసంకల్పంతో విజయమే లక్ష్యంగా తలపడుతున్నారు. ఈనాటి ఈ పోటీలను పోటీలకు కేంద్ర భారీ పరిశ్రమల శాఖామాత్యులు శ్రీ భూపతి రాజు శ్రీనివాస్ వర్మ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. వారు క్రీడాకారులతో మాట్లాడుతూ క్రీడలు మానసిక, శారీరక దృఢత్వమునకు ఎంతో కీలకమన్నారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో కూడా రాణిస్తూ భారతదేశపు యువశక్తిని ప్రపంచ దేశాలకు తెలియజేయాలన్నారు. విద్యార్థులు అన్ని రంగాలలో రాణిస్తూ మీ ప్రతిభను చాటాలన్నారు.జాతీయ స్థాయి క్రీడాపోటీలు సైతం నిర్వహించుకోవడానికి వేదికైన ఇంత చక్కటి విద్యా ప్రాంగణాన్ని ఈ క్రీడల కోసం మీకు కేటాయించిన పాఠశాల వ్యవస్ధాపకులు శ్రీ పుల్లయ్యని ,పాఠశాల సీఈవోలు జి. గోపీనాథ్ ,జి.సౌమ్య గోపీనాథ్ లను ప్రత్యేకంగా అభినందించుకోవాలన్నారు. అనంతరం పాఠశాల వ్యవస్థాపకులు జి .పుల్లయ్య మాట్లాడుతూ విద్యార్థులకు అవసరమైన వసతులను, సౌకర్యాలను మేము ఎన్ని ఇక్కట్లను ఎదుర్కొన్న తప్పక వారికి అందించడానికి ఎల్లప్పుడూ రవీంద్ర విద్యా సంస్థలు ముందు వరుసలో ఉంటాయని వ్యక్తం చేశారు. యువశక్తి అవసరం ఈ దేశానికి ఎంతో అవసరమన్నారు .యువశక్తి దేశ పునర్నిర్మాణ శక్తి అని గుర్తు చేశారు. ప్రపంచదేశాలంతా తమ వైపు చూసేలా చేస్తున్న మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ ని మనమంతా ఆదర్శంగా తీసుకోవాలన్నారు .ఈ కార్యక్రమంలో పాఠశాల సీఈవోలు జి. గోపీనాథ్ మరియు జి. సౌమ్య గోపీనాథ్ లతోపాటు డీన్ రాజేంద్రన్, ప్రిన్సిపల్ రాజ్ కమల్, రోల్ బాల్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ జి చంద్రమౌళి ,రోల్ బాల్ రాష్ట్ర కార్యదర్శి అనిల్ కుమార్ రెడ్డి , ప్రోగ్రాం ఆర్గనైజింగ్ కన్వీనర్ సునీల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.