టిడిపి హయాంలో గ్రామాలు సమగ్రాభివృద్ధి
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ: తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో గ్రామాలు సమగ్ర అభివృద్ధికి నోచుకుంటున్నాయని టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు కే సాంబశివరెడ్డి అన్నారు. పత్తికొండ మండలంలోని పుచ్చకాయలమడ గ్రామంలో జరిగిన అభివృద్ధి పనులను శుక్రవారం నాడు ఆయన చేత ప్రారంభించారు. గ్రామంలో పశుసంవర్ధక శాఖ చేపట్టిన గోకులం పశువుల షెడ్లను ఆయన ప్రారంభించారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రామాభివృద్ధి కోసం ఇచ్చిన హామీల మేరకు అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాగునీటి వసతులు, సిసి రోడ్లు డ్రైనేజీ కాలువలు ఇతర అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఆయన ఈ సందర్భంగా తెలిపారు. పశువుల రైతుల అభివృద్ధి కోసం కేంద్ర,రాష్ట్రప్రభుత్వాలు అనేక పథకాలు అమలవుతున్నాయని అన్నారు. అందులో భాగంగా పాడి, పశువులకు మినీ గోకులం షెడ్ల నిర్మాణానికి పెద్ద ఎత్తున పనులు జరుగుతున్నాయన్నారు. మినీ గోకులం షెడ్ల నిర్మాణానికి 90% సబ్సిడీ పశువుల రైతులకు అందుతుందన్నారు.ఇప్పటికే గ్రామంలో 20 మినీ గోకులం షెడ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ పథకాన్ని పశువుల రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.అలాగే గ్రామంలో ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు, ఇల్లు మంజూరుకు చర్యలు తీసుకుంటున్నా మన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రాఘవేంద్ర, ఎన్ఆర్ఈజీఎస్ ఏపీవో, వెటర్నరీ డాక్టర్ లక్ష్మన్న, వెటర్నరీ అసిస్టెంట్ కావ్య శ్రీ, గ్రామస్తులు పాల్గొన్నారు.