పాఠశాల విద్య కమిషనర్ తో సమావేశం
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: పాఠశాల విద్య కమిషనర్ వి.విజయరామరాజు తో పాఠశాలల సముదాయ పునర్నిర్మాణ కార్యక్రమం పైన జరిగిన సమావేశంలో క్రింది అంశాలను ప్రకటించడం జరిగింది.117 జీవో రద్దు అనంతరం తీసుకువచ్చే జీవోపై నిన్న ఇచ్చిన ముసాయిదా నిబంధనల మేరకు కమిషనర్ జనవరి 20వ తేదీ నుండి క్షేత్రస్థాయిలో అధికారులతో సమావేశం అవుతారు.క్షేత్రస్థాయి నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా జనవరి నెల చివరి నాటికి జీవో విడుదల చేస్తారు.అప్పటివరకు సూచనలు సలహాలు స్వీకరిస్తారు.ప్రతి పంచాయతీలో ఒక ఆదర్శ ప్రాథమిక పాఠశాలను గ్రామ పంచాయతీ తీర్మానం ఆధారంగా ఏర్పాటు చేస్తారు. ఒక పంచాయతీలో 60 మంది పైగా విద్యార్థులు గల పాఠశాలలు ఒకటి కన్నా ఎక్కువ ఉన్నా దానిని కూడా ఆదర్శ ప్రాథమిక పాఠశాలగా నిర్వహిస్తారు.తెలుగు సమాంతర మాధ్యమాన్ని కొనసాగించాలని కోరగా, ఇంగ్లీష్ మాధ్యమం మాత్రమే ఉంటుందని, ఈ సంవత్సరంతో పాటు రాబోయే ఒకటి రెండు సంవత్సరాలు తెలుగు మాధ్యమంలో కూడా పదవ తరగతి పరీక్షలు నిర్వహిస్తామన్నారు.పురపాలక పాఠశాలల్లో కూడా తీసుకొచ్చే కొత్త జీవో ఆధారంగా పోస్టులను సర్దుబాటు చేస్తారు. అయితే పురపాలక పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఎక్కువగా ఉన్నందున అదనంగా కావలసిన పోస్టులపై నిర్ణయం తీసుకుంటామన్నారు.75 మంది పైగా విద్యార్థులు గల ఉన్నత పాఠశాలకు హెచ్ఎం, పిడి పోస్టులను మంజూరు చేస్తామన్నారు. జిల్లాలో ఇంకా సర్ ప్లస్ గా ఉంటే డిసెండింగ్ ఆర్డర్లో సర్దుబాటు చేస్తారు.అనాథరైజ్డ్ ఆబ్సెంట్ అయిన ఉపాధ్యాయులకు బదిలీలలో నెలకు ఒక పాయింట్ చొప్పున గరిష్టంగా 10 మైనస్ పాయింట్లు ఇవ్వడం జరుగుతుంది.జనవరి చివరి నాటికి డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడవచ్చని, ఫిబ్రవరి మార్చి నెలలో బదిలీల చట్టం అసెంబ్లీలో చేసే అవకాశం ఉంటుందని తెలిపారు.సంక్రాంతి సెలవుల్లో ఎస్.ఎస్.సి యాక్షన్ ప్లాన్ లో విద్యార్థులకు సెల్ఫ్ ప్రిపరేషన్ తప్ప క్లాసుల నిర్వహణ లేదని, కానీ క్రింది స్థాయిలో సెలవులలో కూడా క్లాసులు నిర్వహించాలని వత్తిడి చేస్తున్న విషయంపై ప్రస్తావించగా విల్లింగ్ ఉంటే నిర్వహించండి తప్పనిసరి కాదని తెలిపారు.పురపాలక ఉపాధ్యాయులకు ఇంటర్ మేనేజ్మెంట్, జిల్లా పరిషత్ ఉపాధ్యాయులకు ఇంటర్ డిస్ట్రిక్ట్ బదిలీలు చేపట్టాలని కోరగా ప్రభుత్వానికి ప్రాతినిధ్యం చేయాలని తెలిపారు.బదిలీలలో పాయింట్ల కేటాయింపు, ప్రాధాన్యత కేటగిరి తదితర అంశాలపై చర్చించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఆర్జెడి కడప శ్రీ శామ్యూల్కర్నూల్ డిఇఓ శ్రీ శామ్యూల్ పాల్ , సమగ్ర శిక్ష APC శ్రీనివాసులు వివిధ మండలాల MEO -I మరియు MEO -II జిల్లాలోని స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు మరియు సెక్టరియల్ ఆఫీసర్లు పాల్గొన్నారు.