సమాజంలో మీడియా పాత్ర కీలకం..
1 min readప్రముఖ కార్డియాలజిస్ట్ డా. చంద్రశేఖర్
కర్నూలు, పల్లెవెలుగు:సమాజ అభివృద్ధిలో మీడియా పాత్ర కీలకమన్నారు ప్రముఖ కార్డియాలజిస్ట్ డా. చంద్రశేఖర్. శుక్రవారం కర్నూలు హార్ట్ అండ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో పల్లెవెలుగు దినపత్రికకు సంబంధించిన నూతన క్యాలెండర్ (2025)ను న్యూరాలజిస్ట్ డా. హేమంత్ కుమార్ తో కలిసి ఆవిష్కరించారు. ప్రభుత్వానికి.. ప్రజలకు మధ్య వారధిగా వ్యవహరించి మీడియా.. దేశాభివృద్ధిలోనూ ప్రధాన పాత్ర పోషించాలన్నారు. వాస్తవాలు రాసే పత్రికలలో పల్లెవెలుగు దినపత్రిక ఒకటని ఈ సందర్భంగా డా. చంద్రశేఖర్ ప్రశంసించారు. మున్ముందు అన్ని రంగాలకు సంబంధించి… మంచి సందేశాత్మక వార్తలు రాయాలని ఆయన ఆకాంక్షించారు.కార్యక్రమలో పల్లెవెలుగు దినపత్రిక కర్నూలు రిపోర్టర్ ఎం. ఉరుకుందు, నందికొట్కూరు విలేకరి స్వాములు, పోటో గ్రాఫర్ శివన్న తదితరులు పాల్గొన్నారు.