తరిగోపులలో వడ్డే ఓబన్న జయంతి..
1 min readపల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: వడ్డే ఓబన్న చిరస్మర నీయుడు అని టిడిపి సీనియర్ నాయకులు నారాయణరెడ్డి, గిరీశ్వర్ రెడ్డి అన్నారు. శనివారం నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండల పరిధిలోని తరిగోపుల గ్రామంలో స్వాతంత్య్ర సమరయోధులు, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సేనాధిపతి వడ్డే ఓబన్న జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పించారు.ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామానికి ముందే దక్షిణ భారతదేశంలో బ్రిటీష్ వలస పాలకుల ఆగడాలు,దౌర్జన్యాలకు వ్యతిరేకంగా మొట్టమొదటి స్వాతంత్య్ర పోరాటం జరిపిన రేనాటి యోధుడు వడ్డే ఓబన్న. ఆయన చరిత్ర చిరస్మరణీయం..వడ్డే ఓబన్న విలువలు సూచనలు పాటిస్తూ మెరుగైన సమాజ నిర్మాణం కోసం కృషిచేద్దామని గ్రామస్తులు అందరూ కలిసి ఘనంగా వేడుకలు జరిపి మిఠాయిలు పంచుకున్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహేష్ రెడ్డి,యుగంధర్ రెడ్డి, వడ్డే వెంకటేశ్వర్లు,బీసన్న, సుంకన్న,పాపా రాయుడు,రంగస్వామి, శేఖర్,ధర్మరాజు,పాల్గొన్నారు.