ఎమ్మెల్యే వచ్చినా..అధికారులు ఉండరా
1 min readరైతులకు పశువుల షెడ్లు ఎంతో కీలకం:ఎమ్మెల్యే
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: పశువుల షెడ్లు రైతులకు ఎంతో కీలకమని నంద్యాల జిల్లా నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య అన్నారు శనివారం నందికొట్కూరు మండలంలోని మల్యాల,10 బొల్లవరం మరియు మిడుతూరు మండలం రోళ్లపాడు గ్రామంలో నూతనంగా నిర్మించిన పశువుల షెడ్లను ఎమ్మెల్యే జయసూర్య ప్రారంభించారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా నూతనంగా నిర్మించిన గోకులం షెడ్లు ఒక్కో షెడ్డు కు 2 లక్షల 30 వేల రూ.లతో నిర్మించారు.వీటిలో రైతు వాటా 23 వేలు ఉంటుంది.మల్యాల,బొల్లవరం గ్రామాల్లో సీఎల్ఆర్సీ డైరెక్టర్ ఏసుదాసు,డ్వామా ఏపీడీ అన్వరా బేగం,ఎంపీడీవో సుబ్రహ్మణ్యం శర్మ,జలకళ స్వాములు ప్రజా ప్రతినిధుల సమక్షంలో ఎమ్మెల్యే ప్రారంభించారు.తర్వాత రోళ్లపాడు గ్రామంలో జరిగిన గోకులం షెడ్డు ప్రారంభోత్సవానికి కొందరు అధికారులు రాకపోవడం పట్ల ఎమ్మెల్యే అధికారులపై అసహన వ్యక్తం చేశారు.నేను వచ్చినా కూడా అధికారులు ఎందుకు రాలేదు.ఎమ్మెల్యే అంటే అంత చులకనా అంటూ అదే విధంగా రాని వారి నుంచి వివరణ తీసుకోవాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు.కొందరికి పనులు చేస్తున్నారు మాకు పనులు చేయడం లేదని నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా మీరు అలా ఎందుకు చేస్తున్నారు వెంటనే పనులు చేయాలని అధికారులను ఆదేశించారు.తర్వాత అనారోగ్యంతో ఉన్న ఉప్పరి బాల గుర్రప్ప ఇంటికి వెళ్లి ఎమ్మెల్యే పరామర్శించారు.ఈ కార్యక్రమంలో మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి, ఎంపీడీవో పి.దశరథ రామయ్య,తహసిల్దార్ శ్రీనివాసులు,ఏపీఓ జయంతి,గ్రామ సర్పంచ్ పేరెడ్డి వెంకటరామిరెడ్డి,మాజీ సర్పంచ్ నాగ స్వామి రెడ్డి, సర్వోత్తమ్ రెడ్డి,నాగేంద్రుడు, శ్రీనివాసరెడ్డి,పంచాయితీ కార్యదర్శి సుగుణావతి మరియు ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు.