ఒక్క నిమిషం ఆలోచించి..హెల్మెట్ ధరించండి
1 min readపెండింగ్ చలాన్లు..వాహనాల తనిఖీ ..ఎస్ఐ ఓబులేష్..
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు (నందికొట్కూరు): ఒక్క నిమిషం ఆలోచించి హెల్మెట్ తప్పకుండా ధరించాలని హెల్మెట్ ధరిస్తే ప్రమాదాలు నివారించవచ్చని నంద్యాల జిల్లా మిడుతూరు ఎస్ఐ హెచ్.ఓబులేష్ వాహనదారులతో అన్నారు. శనివారం సాయంత్రం మిడుతూరు మండల కేంద్రంలో నందికొట్కూరు-నంద్యాల ప్రధాన రహదారిలో బ్రహ్మంగారి మఠం దగ్గర సిబ్బందితో కలిసి ఎస్సై వాహనాల తనిఖీ చేపట్టారు. అధిక లోడులతో వెళ్తున్న భారీ వాహనాలు,ఆటోలు,ద్విచక్ర వాహనాలు లైసెన్సులు మరియు పత్రాలు పరిశీలించారు.గతంలో చెల్లించని వాహనాల చలానాలు వెంటనే చెల్లించాలని అన్నారు. తర్వాత అక్కడే వాహనదారులతో ఎస్ఐ సమావేశమై కుటుంబాలను మీ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరిస్తే ప్రమాదాలను నివారించవచ్చని అన్నారు. కొందరు అతివేగం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారని అలాంటి కుటుంబాలు చిన్నా భిన్నం అవుతున్నాయని అలా కాకుండా ఉండాలంటే వాహనాలు నిదానంగా వెళ్లే విధంగా ఉండాలన్నారు.ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ సుబ్బయ్య,మన్సూర్,నాగన్న, సలాం తదితరులు పాల్గొన్నారు.