అలగనూరులో గుండెపోటుతో మహిళా మృతి..
1 min readపల్లెవెలుగు వెబ్ మిడుతూరు (నందికొట్కూరు): నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని అలగనూరు గ్రామానికి చెందిన మహిళ గుండెపోటుతో మృతి చెందారు. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన తాటిపాటి వెంకటేశ్వర్లు భార్య తాటపాటి పార్వతమ్మ (52) యధావిధిగా రోజూ కూలీ పనికి వెళ్లేవారని అంతేకాకుండా ఉపాధి పనికి కూడా వెళుతూ ఉండేవారని వారు అన్నారు.ఉన్నట్టు ఉండి తెల్లవారు జామున పార్వతమ్మ మృతి చెందడం పట్ల కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదం నెలకొంది.ఈమె తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు చేయించుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు.ఈమెకు కుమారులు క్రాంతిరాజు,విజయుడు ఉన్నారు.