రైతుల అభివృద్ధికి అన్ని విధాలా సహకారం అందిస్తాం
1 min readనూతన గోకుల్ షెడ్యూల్ ప్రారంభోత్సవం లో మంత్రాలయం టిడిపి ఇంచార్జ్ ఎన్.రాఘవేంద్ర రెడ్డి
పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం: కూటమి ప్రభుత్వం లో రైతుల అభివృద్ధికి అన్ని విధాలా సహకారం అందిస్తామని మంత్రాలయం టిడిపి ఇన్చార్జ్ మాధవరం రాఘవేంద్ర రెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని చెట్నహల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన గోకులం షెడ్డును రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ 90% సబ్సిడీ తో రైతులకు మరియు పాడి పరిశ్రమలకు ఎంతో మేలు చేస్తుందని తెలిపారు. మన కూటమి ప్రభుత్వం స్థాపించబడుతున్న గొప్ప అభివృద్ధి పథకాలలో గోకుల్ షెడ్ అనేది ఒకటి అన్నారు. ఈ గోకుల్ షెడ్ లకు 90% రాయితీ రైతులకు అభ్యున్నతికి కట్టుబడి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ ఆర్ జి యస్ ఏపిడి లోకశ్వర్, ఎంపీడీవో శోభారాణి, ఈఓఆర్డి ప్రభావతి, ఏపిఓ తిమ్మారెడ్డి, ఏసి శ్రీనివాసులు, టెక్నికల్ అసిస్టెంట్లు రఘువీరానాయుడు, రేణుక, మరుద్వతి, పశు వైద్యులు అశోక్, స్థానిక టిడిపి నాయకులు నాయకులు చాపల నాగేష్, మల్లేష్, చాకలి నరసింహులు, మాజీ జెడ్పిటిసి ఆర్ లక్ష్మయ్య, చావిడి వెంకటేష్, నీటి సంఘం అధ్యక్షులు మాలపల్లి చంద్ర, వరదరాజులు,అశోక్ రెడ్డి,గోపాల్ రెడ్డి, రచ్చమరి టిడిపి నాయకులు పోలి శివ, పోలీ వీరేష్, మండలంలోను అన్ని గ్రామాల కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.