రైతులు అభివృద్ధి లో ముందుండాలి
1 min readమంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి
పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం : రైతులు అభివృద్ధి లో ముందుండాలని మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మండల పరిధిలోని చౌలహళ్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన గోకులం షెడ్ ను రిబ్బన్ కట్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గోకులం షెడ్ నిర్మాణం లో 90 శాతం సబ్సిడీ కింద వస్తుందన్నారు. దీని ద్వారా రైతులకు పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం ఉపయోగపడుతుందన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్ ఆర్ జి యస్ ఏపాడి లోకశ్వర్, ఎంపిడిఓ శోభారాణి, ఈఓఆర్డి ప్రభావతి, వైకాపా మండల అధ్యక్షులు బీంరెడ్డి, ఇన్చార్జ్ విశ్వనాథ్ రెడ్డి, ఏపిఓ తిమ్మారెడ్డి, ఏసి శ్రీనివాసులు, టెక్నికల్ అసిస్టెంట్లు రఘువీరానాయుడు, రేణుక, మరుద్వతి, సత్యనారాయణ రెడ్డి, రాఘవేనమ్మ, సర్పంచ్ రాధ, ఎంపిటిసి మర్కట్ ఈరన్న, బూదురు మల్లికార్జున రెడ్డి, నర్సిరెడ్డి , సాయి నాథ్ రెడ్డి, పెద్దరంగన్న, చందయ్య వీరేశ్, బొజ్జప్ప, పెద్ద వీరేష్, వీరేష్, వీరారెడ్డి, ముల్లా బుల్లయ్య, నడిపన్న, పంచాయతీ కార్యదర్శి గౌతమి తదితరులు పాల్గొన్నారు.