సంక్రాంతి సంబరాల ముగ్గుల పోటీలను ప్రారంభించిన టీజీ వెంకటేష్ సతీమణి
1 min readముగ్గుల పోటీలలో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసిన మహిళలు.
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఈనెల 15వ తేదీ జరిగే బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ,రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ముఖ్య అతిథులుగా పాల్గొంటారన్న డివిఆర్ బ్రాడ్‌బ్యాండ్ అధినేత డి. వెంకటేశ్వర్ రెడ్డి.కర్నూల్ నగరంలోని స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో డివిఆర్ బ్రాడ్‌బ్యాండ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సంక్రాంతి సంబరాల ముగ్గుల పోటీలను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ సతీమణి శ్రీమతి టీజీ రాజ్యలక్ష్మి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా సంక్రాంతి పర్వదిన ప్రాధాన్యతను వివరిస్తూ గంగిరెద్దుల విన్యాసాలు, భోగి మంటలు, హరిదాసుల కార్యక్రమం అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ పోటీలలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని తమ అభిరుచులకు తగిన విధంగా ముగ్గులు వేసి విజయవంతం చేశారు. మహిళలు వేసిన ముగ్గులను ముఖ్య అతిథి రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ సతీమణి శ్రీమతి టీజీ రాజ్యలక్ష్మి పరిశీలించి మహిళలను అభినందించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో డివిఆర్ బ్రాడ్‌బ్యాండ్ అధినేత డి. వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ,రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మార్గదర్శనంలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ముగ్గుల పోటీలను ఏర్పాటు చేశామని చెప్పారు. గతంలో 2020 సంవత్సరంలో కూడా తమ సంస్థ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలను ఏర్పాటు చేశామని వివరించారు. ఈనెల 15వ తేదీ సాయంత్రం ఐదు గంటలకు జరిగే ముగ్గుల పోటీల బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ,రాష్ట్ర మంత్రి టీజీ భరత్ హాజరై మహిళలకు బహుమతులను ప్రధానం చేస్తారని వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వారు అంగీకరించినందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందని వెల్లడించారు. ముగ్గుల పోటీలలో 1000 మంది మహిళలు పాల్గొన్నారనీ, పాల్గొన్న ప్రతి ఒక్కరికి మూడు లీటర్ల రైస్ కుక్కర్ అందజేస్తామని చెప్పారు. పోటీలలో ప్రతిభ కనబరిచిన వారికి మొదటి బహుమతిగా ఓపెన్ ప్లాట్, రెండో బహుమతిగా ఈ బైక్, మూడో బహుమతిగా సోఫా సెట్, నాలుగో బహుమతిగా పావు కిలో వెండి తో పాటు మరో 30 బహుమతులను అందజేస్తామని చెప్పారు. గతంలో జిల్లా స్థాయిలో ముగ్గుల పోటీల నిర్వహించామని కానీ ఈసారి కర్నూలు మహిళలను దృష్టిలో ఉంచుకొని కర్నూలు నగరం తో పాటు పది కిలోమీటర్ల పరిధిలో ఉన్న వారిని మాత్రమే పాల్గొనేలా పోటీలు నిర్వహించామని వివరించారు. ఈనెల 15వ తేదీ జరిగే బహుమతుల ప్రధాన ఉత్సవ కార్యక్రమం అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు జబర్దస్త్ కళాకారులచే వినోద కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో యాక్టర్ రష్మి గౌతమ్ ,యాంకర్ దీప్తి నల్లమోతు, సింగర్లు హనుమాన్, సాయి శిల్ప, జబర్దస్త్ కళాకారులు కెవ్వు కార్తీక్ ,వినోద్, శాంతి స్వరూప్, నుకరాజు, రాము, ప్రవీణ్ తదితరులు పాల్గొంటారని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రజల అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం డివిఆర్ సిటీ డిజిటల్ జనరల్ మేనేజర్ ఎస్.కె మహేష్ మాట్లాడుతూ ఏ కార్యక్రమం చేపట్టిన సక్సెస్ ఫుల్ గా చేయడం డివిఆర్ గ్రూప్ సంస్థల అధినేత డి వెంకటేశ్వర్ రెడ్డికి సాధ్యమని చెప్పారు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా సాధారణంగా ప్రతి ఒక్కరు తమ ఇళ్ళ ముందు ముగ్గులు వేస్తారని ,అలా కాకుండా అందరినీ ఒకచోట చేర్చి సామూహికంగా ముగ్గులు వేసేలా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని వివరించారు. బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ముఖ్య అతిథులుగా పాల్గొనడం ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది అని చెప్పారు. ముగ్గుల పోటీల నేపథ్యంలో ఈ ప్రాంగణం పండగ వాతావరణం సంతరించుకుందని వివరించారు .పోటీల్లో పాల్గొన్న వారికి ప్రత్యేక ప్రత్యేక బహుమతులతో పాటు పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతులను అందజేస్తామని వివరించారు.