పోలీసుల అదుపులో తలారి…
1 min readపల్లెవెలుగు వెబ్ మహానంది: మండలంలోని ఒక గ్రామానికి చెందిన తలారి పోలీసుల అదుపులో ఉన్నట్టు విశ్వాసనీయ సమాచారం. సోమవారం సాయంత్రం మహానంది పోలీసులు గాజులపల్లె సమీపంలో కోడిపందాలు ఆడుతున్న వారిపై పోలీసులు దాడులు నిర్వహించగా ఒక తలారి కూడా పోలీసులకు చిక్కినట్లు తెలుస్తుంది. గతంలో ఎర్రమట్టి అక్రమ రవాణాకు సంబంధించిన వాటిలో కూడా ఆ తలారి కీలక భూమిక పోషించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ వర్గాలను కూడా బురిడీ కొట్టించి ఎర్రమట్టి అక్రమ రవాణాలో కీలక పాత్ర వహించినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.