చెడు అలవాట్లను భోగి మంటల్లో వదలండి…
1 min readఆరోగ్యాన్ని కాపాడుకోండి…
- ప్రముఖ కార్డియాలజిస్ట్ డా. చంద్రశేఖర్
- కర్నూలు హార్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో భోగి సంబరాలు
కర్నూలు, పల్లెవెలుగు: రైతుల ఇంట సిరిసంపదలు తీసుకొచ్చే సంక్రాంతి పండగను మూడు రోజులపాటు ప్రజలు అత్యంత వైభవంగా జరుపుకుంటారని, మొదటి రోజు జరుపును భోగి మంటల్లో చెడు అలవాట్లను వదిలేయాలని సూచించారు ప్రముఖ కార్డియాలజిస్ట్ డా. చంద్రశేఖర్. సోమవారం భోగభాగ్యాల భోగిని పురస్కరించుకుని కర్నూలు హార్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో భోగి పండగ సంబరాలు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి , ప్రముఖ కార్డియాలజిస్ట్ డా. చంద్రశేఖర్ మాట్లాడుతూ మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా భోగి పండగను జరుపుకోవడం సంతోషించదగ్గ విషయమన్నారు. ఇంట్లోని పాత వస్తువులను భోగి మంటల్లో వేసినట్లే….చెడు అలవాట్లను కూడా భోగి మంటల్లో వదిలేయాలని, అప్పుడే ఆరోగ్యం సురక్షితంగా ఉంటుందన్నారు. కొత్త జీవితానికి శ్రీకారం చుట్టినప్పుడు భవిష్యత్ ఆనందమయంగా ఉంటుందన్నారు. సంక్రాంతి పండగను ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో జరుపుకోవాలని ఈ సందర్భంగా డా. చంద్రశేఖర్ ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్ కల్కూర, ట్రెజరర్ రాముడు, సభ్యులు డా.హేమంత్ కుమార్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.