తమిళనాడులో పవన ఇండస్ట్రీస్…
1 min readఎస్ఐపిసిఓటి పారిశ్రామిక పార్క్ లో 99 సంవత్సరాల లీజ్ డీడ్‌పై రెండు ప్లాట్లు
పల్లెవెలుగు వెబ్ హైదరాబాద్: బీఎస్ఈ: 543915, ఎన్‌ఎస్‌ఈ: పవన ఇండ్‌గా చేర్చబడిన పపవన ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఆటోమోటివ్ పార్టుల తయారీలో ప్రముఖంగా ఉన్న సంస్థ, తమిళనాడు క్రిష్ణగిరి జిల్లాలోని స్టేట్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్ ఆఫ్ తమిళనాడ(ఎస్ఐపిసిఓటి) పారిశ్రామిక పార్క్, షూలగిరి (ఫ్యూచర్ మొబిలిటీ పార్క్)లో 4.33 ఎకరాల విస్తీర్ణం కలిగిన రెండు ప్లాట్లను 99 సంవత్సరాల లీజుకు రూ.7.36 కోట్ల ఒప్పందంపై పొందినట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా పవన ఇండస్ట్రీస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ స్వప్నిల్ జైన్ మాట్లాడుతూ, “మా క్యూ2 ఎఫ్ వై 25 ఆర్థిక ఫలితాలు మా వ్యూహాత్మక చర్యల విజయం, అద్భుతమైన మార్కెట్ స్థానం మరియు కార్యాచరణ ప్రదర్శనకు నిదర్శనంగా నిలుస్తాయి. ఈవీ పరిశ్రమలో భారతదేశం గ్లోబల్ హబ్‌గా ఎదిగే ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని పవన ఇండస్ట్రీస్ భవిష్యత్ విజయాలకు దోహదపడే అవకాశాలను కల్పించుకుంటోంది,” అని తెలిపారు.ప్రస్తుతం పవన ఇండస్ట్రీస్ తన మాన్యుఫాక్చరింగ్ యూనిట్లను అలీగఢ్ (ఉత్తరప్రదేశ్), ఔరంగాబాద్ (మహారాష్ట్ర), మరియు పంత్‌నగర్ (ఉత్తరాఖండ్)లో ఏర్పాటు చేసింది. 50 సంవత్సరాల పరిశ్రమ అనుభవం కలిగిన పవన ఇండస్ట్రీస్ ప్రఖ్యాత ఓఈఎం సంస్థలతో అనుబంధం కలిగి ఉంది. బజాజ్, హోండా, టీవీఎస్, టాటా వంటి దేశీయ మరియు అంతర్జాతీయ మార్కెట్ భాగస్వామ్యాలతో విశాలమైన ఉత్పత్తి శ్రేణిని అందిస్తుంది.