భగవాన్ బాల సాయి బాబా సేవలు చిరస్మరణీయం
1 min readమాజీ రాజ్యసభ సభ్యులు టిజి వెంకటేష్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: భగవాన్ బాల సాయిబాబా పేద ప్రజలకు చేసిన సేవలు చిరస్మరణీయమని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. మంగళవారం నాడు బాల సాయి జయంతిని పురస్కరించుకుని బాలసాయి మందిరంలో ఆయనకు నివాళులర్పించి, అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బాల సాయిబాబా మన మధ్యన లేకపోయినప్పటికీ, ఆయన చేపట్టినటువంటి సేవా కార్యక్రమాలు ఎందరికో స్ఫూర్తిదాయకమన్నారు. తనకు బాల సాయిబాబా తో 40 ఏళ్ల అనుబంధం ఉందని అన్నారు. బాల సాయి సేవా కార్యక్రమాలు కొరకు ఇక్కడి వారితో ఎవరితోను విరాళాలు సేకరించలేదని విదేశాల నుంచి వచ్చిన నిధులను, ప్రాంతీయ అభిమానంతో ఇక్కడి వారి సేవ కొరికే వినియోగించే వారిని టీజీ తెలిపారు. మనం చేసే సాయం చిన్నదైనా పదిమందికి ఆదర్శప్రాయంగా ఉండే విధంగా చేయాలన్నదే బాల సాయి ఆకాంక్షని టీజీ తెలిపారు. బాల సాయి భౌతికంగా మన మధ్యన లేకపోయినా ఆయన మొదలుపెట్టిన కార్యక్రమాలను ట్రస్టు ఆధ్వర్యంలో నిరంతరాయంగా కొనసాగిస్తున్న రామారావు నిజంగా అభినందనీయుడని టీజీ వెంకటేష్ కొనియాడారు. బాల సాయిబాబా చిన్న వయసు నుంచి ఆధ్యాత్మికంగా బోధనలు చేస్తూనే, ప్రజలను మంచి మార్గంలో నడిపించేందుకు కృషి చేస్తూ సేవా కార్యక్రమాలు చేశాడన్నారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న ట్రస్ట్ ఆస్తులనే కొంతమంది కబ్జా చేయాలని చూశారని, కానీ బాల సాయి వాటిని తట్టుకొని తన కార్యక్రమాలు కొనసాగించారని టీజీ తెలిపారు. బాలసాయి జన్మదిన సందర్భంగా పేద ప్రజలకు ఉచితంగా తోపుడు బండ్లు, కుట్టు మిషన్లు, ట్రై సైకిల్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు, మాజీ ఎమ్మెల్యే మదన గోపాల్, విహెచ్పి నాయకులు నంది రెడ్డి సాయి రెడ్డి, ఉషశ్రీ, డాక్టర్ జయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.