పేదప్రజల సంక్షేమం కోసమే సీయం సహాయ నిధి
1 min readనంద్యాల ఎంపీ డా.బైరెడ్డి శబరి
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: పేద ప్రజల సంక్షేమం కొరకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో తోడ్పడుతుందని నంద్యాల ఎంపీ డా.బైరెడ్డి శబరి అన్నారు. బుధవారం కల్లురులోని ఎంపీ నివాసంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను బాధితులకు అందజేశారు. ఈ సందర్బంగా ఎంపీ డా.బైరెడ్డి శబరి మాట్లాడుతూ, చాలామంది నిరుపేదలు ఆసుపత్రుల పాలై ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడుతున్న వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతగానో ఉపయోగ పడుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబంలో కష్టం ఎదురైతే ఆ కుటుంబానికి పెద్ద కొడుకుగా ఆదుకుంటానని మాట ఇచ్చి ఆ మాటను నిలబెట్టుకోవడం చాల సంతోష కరం అన్నారు. గోస్పాడు మండలం ఒంటెలగల గ్రామం గాండ్ల మనిచందుకు రూ. 800313, రుద్రవరం మండలం నరసాపురం గ్రామానికి చెందిన మహాబుబ్ బి కి రూ. 41048, కొత్తపల్లి మండలం యం. రఘురాముడు కు రూ. 91572, పగిడ్యాల సత్యనారాయణ రెడ్డి కి రూ. 87226, రుద్రవరం టీ. గుర్రప్పకు రూ. రూ. 4,05189, పాములపాడు మండలం చెలిమిళ్ల గ్రామం టీ. వెంకటరామిరెడ్డి కి రూ. 1,43502, కొత్తపల్లి మండలం గువ్వలకుంట్ల గ్రామం గంధం మహేశ్వరీ కి 1,06874 రూపాయల ను సీఎం రిలీఫ్ ఫండ్ కింద మంజూరు చేయించి బాధితులకు చెక్కులు అందించామని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి వివరించారు.