చిన్నహ్యట శేషగిరికే మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవిని కేటాయించాలి
1 min readహొళగుంద మండలం హెబ్బటం గ్రామ టీడీపీ నాయకులు, దళిత నేతలు, “
పల్లెవెలుగు వెబ్ హొళగుంద: ఆలూరు నియోజకవర్గంలోని ఆలూరు మార్కెట్ యార్డు చైర్మన్ పదవి యస్సి రిజర్వ్ చేసినందుకు తెలుగుదేశం పార్టీ అధిష్టాననికి ముందుగా కృతజ్ఞతలు తెలుపుతూ, గత 30 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ అభ్యున్నతికై అహర్నిశలు పాటుపడుతున్న రాష్ట్ర దళిత నాయకులు టిడిపి సీనియర్ నేత చిన్నహ్యట శేషగిరికె ఆలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవిని కేటాయించాలని హెబ్బటం గ్రామ టీడీపీ నాయకులు, చిన్న నాగయ్య, యూనిట్ ఇంచార్జ్ బి. సవారప్ప, మాల మహానాడు మాజీ మండల అధ్యక్షుడు బి. మల్లికార్జున,బూత్ ఇంచార్జ్ గోపాల్ కోరారు ఆలూరు నియోజకవర్గంలో ఎన్నడూ ఏ పదవిని ఆశించకుండా తెలుగుదేశం పార్టీ సమిష్టి సాధికారాతకై రాజిలేని సేవలను అందిస్తూ పార్టీ విజయమే ప్రథమ లక్ష్యంగా గత 30 సంవత్సరాలుగా వివిధ టిడిపి అభ్యర్థుల విజయానికై విశేషంగా కృషి చేయడంతో పాటు మంత్రాలయం, బనగానపల్లె లాంటి నియోజకవర్గాలలో టిడిపి తరుపున ఎన్నికల సమన్వయకర్తగా వ్యవహరించి తన కార్యదక్షతను నిరూపించుకున్నారు.కాగా నేటి వరకు ఆలూరు మార్కెట్ యార్డు చైర్మన్లుగా నియోజకవర్గంలోని వివిధ మండలాల నాయకులకు అవకాశం కల్పించినప్పటికీ, ఇప్పటిదాకా హొళగుంద మండలానికి తగిన గుర్తింపు లేదు , ఇప్పటికైనా హొళగుంద మండలానికి సమూచిత స్థానం కల్పిస్తూ తెలుగుదేశం అధిష్టానం ఈసారి తప్పకుండా అపార రాజకీయ అనుభవం, కలిగిన సీనియర్ నాయకులు చిన్నహ్యట శేషగిరి కి ఆలూరు వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్ పదవి కేటాయించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమం లో నాయకులు, చిన్న నాగయ్య, సవారప్ప, మల్లికార్జున, గోపాల్,కుమ్మరి కృష్ణ, శేక్షవాలి, శేఖర్, గాదిలింగ, రంగప్ప, వీరేష్, తదితరులు పాల్గొన్నారు.