డ్రోన్ల ద్వారా ఏరియల్ సర్వే…
1 min readపల్లెవెలుగు వెబ్ మహానంది: నంద్యాల జిల్లా ఎస్పీ అది రాజు సింగ్ ఆదేశాల మేరకు డ్రోన్ల ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించినట్లు మహానంది ఎస్ఐ రామ్మోహన్ రెడ్డి బుధవారం పేర్కొన్నారు. మండలంలోని అభీపురం, తిమ్మాపురం, గాజులపల్లె, బసాపురం తదితర గ్రామాల ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించామన్నారు. సంక్రాంతి పర్వదిన సందర్భంగా గ్రామాల్లో మరియు పరిసర ప్రాంతాల్లో పేకాట, కోడి పందాలు, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం తదితర వాటితో పాటు అసాంఘిక కార్యకలాపాలు నిరోధించడానికి ఏరియల్ సర్వే ద్వారా నిఘా ముమ్మరం చేశామన్నారు. ఒక ప్రాంతంలో బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న ఇద్దరు వ్యక్తులను గుర్తించి చట్టపరంగా చర్యలు చేపట్టామని ఎస్సై రామ్మోహన్ రెడ్డి తెలిపారు.