మీ జీ తెలుగులో! మంతెన సత్యనారాయణ రాజు అందించే ఆరోగ్య సలహాలు..
1 min readఆరోగ్యమే మహాయోగం జనవరి 20న పున:ప్రారంభం, మీ జీ తెలుగులో!
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: వైవిధ్యభరితమైన వినోదంతోపాటు విజ్ఞానం పెంపొందించే కార్యక్రమాలను అందిస్తున్న ఛానల్ జీ తెలుగు. ప్రముఖ ఆరోగ్య సలహాదారులు మంతెన సత్యనారాయణ రాజు అందించే సలహాలు, సూచనలతో సంపూర్ణ ఆరోగ్యాన్ని పెంపొందించుకునే సమగ్ర సమాచారం అందించే కార్యక్రమం ఆరోగ్యమే మహాయోగం. 1278 ఎపిసోడ్స్తో సుదీర్ఘకాలంపాటు ప్రసారమైన ఆరోగ్యమే మహాయోగం అశేష ప్రేక్షకాదరణ అందుకుంది. మరింత సమగ్ర సమాచారం, సరికొత్త సందేహాలు, సలహాలతో ఆరోగ్యమే మహాయోగం పున:ప్రారంభం జనవరి 20న, సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు ఉదయం 8:30 గంటలకు, మీ జీ తెలుగులో!ఈ కార్యక్రమానికి అన్నపూర్ణ వ్యాఖ్యాతగా వ్యవహరించనుండగా ప్రముఖ ఆరోగ్య సలహాదారులు మంతెన సత్యనారాయణ రాజు ప్రేక్షకుల సమస్యలు, సందేహాలకు సరైన సలహాలు అందిస్తారు. సంపూర్ణ ఆరోగ్యకరమైన జీవితానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, శారీరక, మానసిక ఆరోగ్యానికి జీవన శైలిలో చేసుకోదగిన సూచనలు ఈ కార్యక్రమం ద్వారా పొందవచ్చు. ఆరోగ్యం, ఫిట్నెస్, ఆహారం, అందం.. మొదలైన అంశాలపై సమగ్ర సమాచారం పొందేందుకు మంతెన సత్యనారాయణ రాజు అందించే సూచనలు, సలహాల కోసం జీ తెలుగు అందిస్తున్న ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమాన్ని తప్పక చూడండి!