జాతీయ బీసీ సంక్షేమ సంఘం రౌండ్ టేబుల్ సమావేశం
1 min readవై.నాగేశ్వరావు యాదవ్💐తెలుగుదేశం పార్టీ బీసీ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్💐జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు లోని బీసీ భవన్ నందు ఆంధ్రప్రదేశ్ లో బీసీల యొక్క భవిష్యత్తు పై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాస్, కేంద్ర సాయి నాయకుడు కర్రీ వేణుమాధవ్ , ధనుంజయ ఆచారి పోతురాజు రవికుమార్ చౌదరి గౌడ్ భాషా మొదలైన బీసీ నాయకులు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా వై. నాగేశ్వరరావు యాదవ్ మాట్లాడుతూ:చట్ట సభల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించే విధంగా, కేంద్ర ప్రభుత్వ స్థాయి లో మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి, బీసీలు అన్ని కులాల్లో జనాభా నిష్పత్తి ప్రకారం సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, రాజకీయపరంగా ఎదగడానికి తగిన ప్రాధాన్యత ఇవ్వవలసిందిగా గ్రామస్థాయి నుండి రాష్ట్రస్థాయి వరకు ఉద్యమాన్ని నెలకొల్పడం జరిగింది. ఉద్యమ ఫలితంగానే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బీసీలకు రక్షణ చట్టం తెస్తానని చెప్పడం జరిగింది. బీసీలలో అన్ని కులాలకు ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పడం, 37 వేల కోట్లు బీసీలకు జనాభా నిష్పత్తి ప్రకారం బడ్జెట్ను ఇస్తానని చెప్పడం జరిగింది. అన్ని జిల్లాల్లో బీసీ భవన నిర్మాణం చేపడతామని హామీ ఇవ్వడం జరిగింది. నామినేటెడ్ పోస్టులు బీసీలకు 50% శాతం ఇస్తాను అని చెప్పడం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో గత ప్రభుత్వం 24% ఇస్తే, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం 34 శాతం రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పడం జరిగింది. బీసీల అభివృద్ధికి పాటుపడుతున్న చంద్రబాబునాయుడు కి లోకేష్ బాబు కి ప్రత్యేక ధన్యవాదములు ఈ సందర్భంగా తెలియజేశారు. బీసీల యొక్క డిమాండ్లను ఇండియా ప్రభుత్వానికి ఇంతకుమునుపే సమర్పించడం జరిగింది. దానిని శాసనసభలో తీర్మానం చేసి పార్లమెంటుకు పంపాలని ఈ సందర్భంగా నేను చేస్తున్నాం అలాగే బీసీల కులగననా వెంటనే చేపట్టాలని ఈ సందర్భంగా తెలియజేశారు.