విశాఖ స్టీల్ కు ఆర్థిక ప్యాకేజీ తెచ్చి ఉపిరి పోసిన చంద్రబాబు
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు.. చెప్పిన మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు . విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు రూ.11,440 కోట్లతో ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం. శ్రీ చంద్రబాబు నాయుడు నిరంతర ప్రయత్నంతో విశాఖ స్టీల్ ప్లాంట్ కు ప్రత్యేక గ్రాంట్ ఇచ్చి మళ్ళీ ఊపిరి పోసిన కేంద్రం. నాడు 1999లో కూడా నాటి వాజ్ పాయ్ ప్రభుత్వాన్ని ఒప్పించి విశాఖ స్టీల్ కు ఆర్థిక ప్యాకేజీ తెచ్చి ఉపిరి పోసిన చంద్రబాబు. నేడు మళ్ళీ ప్రధాని మోడీ కి ఆంధ్రుల సెంటిమెంట్ వివరించి, ప్రైవేటీకరణ ఆపించి, ఆర్థిక ప్యాకేజీ వచ్చేలా చేసిన చంద్రబాబు .గత 5 ఏళ్ళుగా, నాటి వైసీపీ ప్రభుత్వ కుట్రలు చేధించి, ప్రజల భాగస్వామ్యంతో, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా ఉద్యమాలు చేసింది తెలుగుదేశం పార్టీ. నేడు కూటమి ప్రభుత్వంలో, కేంద్రానికి పరిస్థితి వివరించి, మళ్ళీ విశాఖ ఉక్కుకి ఊపిరి , జీవం పోశారు.ఇక విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ కు స్వస్థి పలికినట్లే . టిడిపి రాష్ట్ర కార్యదర్శి .ఆంధ్ర ప్రదేశ్ ఆర్య వైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ నంద్యాల నాగేంద్ర.