సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చేసిన శాసనసభ్యులు
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ: ముఖ్యమంత్రి సహాయ నిధి కింద లబ్ధిదారులకు విడుదలైన చెక్కులను స్థానిక ఎమ్మెల్యే శ్యాం కుమార్ శుక్రవారం పార్టీ కార్యాలయంలో పంపిణీ చేశారు. పత్తికొండ పట్టణానికి చెందిన మేకల పెద్దలాలుకుటుంబానికి రూ.1,11,900, తుగ్గలి మండలం జొన్నగిరి గ్రామానికి చెందిన సంగాల ఆనందమ్మ కుటుంబానికి రూ. 30,700, మద్దికేర మండలం పెరవలి గ్రామానికి చెందిన వడ్డే సుశీలమ్మ కుటుంబానికి రూ. 51000, పత్తికొండ పట్టణానికి చెందిన షేక్ అక్బర్ బాషా కుటుంబానికి రూ.37,700, తుగ్గలి మండలం రాంపల్లి గ్రామానికి చెందిన అంగడి సుభాష్ చంద్రబోస్ కుటుంబానికి రూ.30200, పత్తికొండ పట్టణానికి చెందిన కురువ పెద్ద రంగస్వామి కుటుంబానికి రూ. 77900 ల విలువగల చెక్కులను, అలాగే క్రిష్ణగిరి మండలం కంబాలపాడు గ్రామానికి చెందిన ఈ. మాధవి కుటుంబానికిరూ.36,700ల విలువగల చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.