ఏటా15 శాతం వృద్ధేలక్ష్యం…
1 min readఉధ్యాన, ఆక్వా, పాడిపరిశ్రమ అభివృద్ధిపై దృష్టిసారించాలి
స్వర్ణాంధ్ర@2047 ప్రణాళికలో భాగంగా ఐదేళ్లలో నిర్దేశించిన లక్ష్యసాధన దిశగా అడుగులు
జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి: జిల్లాలో ఉధ్యాన పంటలు విస్తరణ, ఆక్వారంగం, పాడిపరిశ్రమ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్ధానిక కలెక్టరేట్ లో కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో నిర్ధేశించిన లక్ష్యాలు, స్వర్ణాంధ్ర@2047లో భాగంగా రానున్న ఐదేళ్లలో సాధించే లక్ష్యాలఅమలు, ప్రగతిపై నిర్ధేశించిన కీ ఫెర్మార్మెన్స్ ఇండికేటర్స్ పై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో పండే ప్రధాన పంటలు, వాటి ఆధారంగా పరిశ్రమల అభివృద్ధి, సాగునీటి వసతి కల్పన, విస్తారంగా ఉన్న భూములకు డ్రిప్ ఇరిగేషన్ వంటివి కల్పించాలన్నారు. ఉధ్యాన పంటల విస్తరణ, ఆక్వారంగం, పాడిపరిశ్రమ అభివృద్ధిపై దృష్టిసారించాలన్నారు. అన్నిరంగాల్లో జిల్లా సమగ్ర అభివృద్ధిధ్యేయంగా స్వర్ణాంధ్ర@2047 విజన్ ప్రణాళికలో భాగంగా ఐదేళ్ల కాలంలో అభివృద్ధి లక్ష్యాలతో నిర్ధేశించుకున్న లక్ష్యాలను సాధించాలన్నారు. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో ఇక రెండు నెలలు మాత్రమే ఉన్నందున అందుకు సంబంధించిన లక్ష్యాలను త్వరితగతిన సాధించాలన్నారు.కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో పేర్కొన్న కీ ఫెర్మార్మెన్స్ ఇండికేటర్స్ సంబంధించి నాటినుంచి నేటి వరకు క్షేత్రస్ధాయిలో సాధించిన ప్రగతి తీరును కలెక్టర్ ఈ సందర్బంగా సమీక్షించారు. ఆయా లక్ష్యసాధనకు క్షేత్రస్ధాయిలో ఏ విధమైన చర్యలు తీసుకున్నదీ అధికారులతో సమీక్షించారు. ప్రతివారం క్షేత్రస్ధాయి అధికారులతో కూడా ఈ అంశాలపై మాట్లాడటం జరుగుతుందన్నారు. మార్చి నెలాఖరు నాటికి నూరు శాతం ఈఏడాది లక్ష్యాలను సాధించాలని స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా ఉధ్యాన శాఖ అధికారి ఎస్. రామ్మోహన్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఎస్ కె.హబీబ్ భాషా, ఏపిఎంఐపి పిడి పివిఎస్ రవికుమార్, జిల్లా మత్స్యశాఖ అధికారి కె.ఎస్.వి. నాగలింగాచార్యులు, పశు సంవర్ధక శాఖ ఇన్ చార్జి జెడి టి.గోవిందరాజు తదితరులు పాల్గొన్నారు.