సమాజాన్ని చైతన్యపరిచిన యోగివేమన గొప్ప దార్శనికులు, సంఘ సంస్కర్త
1 min readజిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా
పల్లెవెలుగు వెబ్ కర్నూలు : తెలుగు సమాజాన్ని చైతన్య పరిచిన యోగి వేమన గొప్ప సంఘ సంస్కర్త, దార్శనికులని జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా పేర్కొన్నారు..ఆదివారం యోగివేమన జయంతి సందర్భంగా క్యాంప్ కార్యాలయం లో జిల్లా కలెక్టర్ యోగివేమన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు .ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సామాన్యులకు సైతం అర్థమయ్యే రీతిలో, అత్యంత సులభంగా తేలికైన పదజాలంతో రచించిన వేమన పద్యాలు అన్ని తరాల ప్రజలు అంగీకరించడం ఆయన రచనల గొప్పతనం అన్నారు. యోగివేమన ప్రజాకవి అని, పామరులు , పండితులను అలరించిన ఆయన కవిత్వం ఎంతో గొప్పదన్నారు. సమాజంలో ఉన్న దురాచారాలపై ఆనాడే తన పద్యాలతో సమాజంలో చైతన్యం రగిలించారన్నారు..వారి రచనల్లో మానవత్వంతో కూడా మిళితమై ఉందని, అలాంటి గొప్ప కవి గురించి స్మరించుకోవడం శుభ పరిణామం అని అన్నారు. ఆయన పద్యాలతో జీవిత సత్యాలను ప్రజలకు తెలియజేశారని, తెలుగు భాష గొప్పదనాన్ని ప్రపంచానికి చాటిచెప్పారని తెలిపారు. సమాజ పరిస్థితులకు అద్దం పట్టేలా వేమన పద్య రచనలు సాగాయని, జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోడానికి వేమన పద్యాలు ఎంతగానో దోహదపడతాయని కలెక్టర్ పేర్కొన్నారు..కార్యక్రమంలో ఇంచార్జ్ డిఆర్ఓ వెంకటేశ్వర్లు, హౌసింగ్ పీడి చిరంజీవి, ఇంచార్జ్ సిపిఓ భారతి, ఇంచార్జ్ సెట్కూరు సీఈవో దీప్తి,జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.