నేత్రపర్వంగా శ్రీ గోదా రంగనాథుల కల్యాణమహోత్సవం
1 min readనిత్యకళ్యాణం పచ్చతోరణానికి శ్రీకారం చుట్టిని జీయర్ స్వాములు
గోదాగోకులం నిర్వహించే ధార్మిక సేవలు ప్రశంసనీయం
మాజీ మంత్రి టి.జి.వెంకటేశ్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు శివారులోని గోదాగోకులం నందు వెలిసిన శ్రీ గోదా రంగనాథుల స్వామివారి కల్యాణమహోత్సవం అత్యంత నయన మనోహరంగా జరిగినది. ఈ వేడుకలో వేలాది మంది భక్తులు వివిధ ప్రదేశాల నుండి పాల్గొన్నారు. శ్రీశ్రీశ్రీ త్రిదండి అష్టాక్షరీ సంపత్కుమార రామానుజ జీయర్ స్వామీజీ ప్రత్యక్ష పర్యవేక్షణలో , వారి అనుగ్రహ భాషణంతో ఆద్యంతం హృదయోల్లాసంగా, జరిగినది. వేద పండితులు రమేశ్ భట్టారాచార్యులు, కిరణ్ భట్టారాచార్యులు, లక్ష్మీనారాయణాచార్యులు మహేశాచార్యులు, ఆధ్వర్యంలో సభా ప్రార్ధన, విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, యజ్ఞోపవీతధారణ, గోత్ర ప్రవరలు, పాదపక్షాళన, కన్యాదానం, మంగళాష్టకాలు, గుడజీలకరం, మంగాళ్య పూజ, మాంగళ్య ధారణ, అక్షతారోపణం, వారణమాయిరం, మాలమార్పిడి, శాత్తుమురై, తీర్థ ప్రసాద గోష్టి, మొదలైన తంతులు నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో టి.సాయిరాం, యం. బాలస్వామి, వై. రమణ కళా బృందం సందర్భోచితమైన కీర్తనలతో ఆద్యంతం అలరింపచేశారు. పాల్గొన్న వేలాది మంది భక్తులకు గోదా గోకులం పరివారం షడ్రుచోపేతమైన భోజనాలు అందించారు.
నిత్యకళ్యాణం పచ్చ తోరణానికి శ్రీకారం
విశ్వ కళ్యాణ శ్రేయస్సుకై గోదాగోకులం కేంద్రంగా నిత్యకళ్యాణం పచ్చ తోరణానికి శ్రీశ్రీశ్రీ త్రిదండి అష్టాక్షరీ సంపత్కుమార రామానుజ జీయర్ స్వామివారుశ్రీకారం చుట్టారు. నేటి నుండి 365 రోజులు స్వామి వారికి ఈ కళ్యాణ వైభోగం నిర్వహించ నున్నట్లు వారు తెలిపారు.గోదాగోకులం ధార్మిక సేవలు ప్రశంసనీయమని మాజీ మంత్రి, మాజీ రాజ్యసభ సభ్యులు టి.జి. వెంకటేశ్ కొనియాడారు. ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఎంతో ప్రశాంతత దొరుకుతుందని, ప్రతి ఒక్కరూ ధార్మిక చింతన అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ త్రిదండి బృందానన రామానుజ జీయర్ స్వామి, శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శఠగోపముని రామానూజ జీయర్ స్వామి, తిరుమల తిరుపతి దేవస్థానములు ధర్మకర్తల మండలి సభ్యులు మల్లెల రాజశేఖర్ గౌడ్, తెలుగుదేశం పార్టీ నాయకుడు పెరుగు పురుషోత్తం రెడ్డి, టి.జి.శివరాజ్, గోదాగోకులం వ్యవస్థాపక అధ్యక్షులు మారం నాగరాజు గుప్త, ట్రస్టీ పల్లెర్ల నాగరాజు, యం.రాంభూపాల్ రెడ్డి, ఇటిక్యాల పుల్లయ్య, గోదాగోకులం సభ్యులతో పాటు వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.