వీధి కుక్కల విషయంలో అనేక సమస్యలు ఉన్నాయి
1 min read

విజయవాడ , న్యూస్ నేడు: వీధి కుక్కలకు సంబంధించి సుప్రీంకోర్టు మార్గదర్శకాలను స్వాగతిస్తున్నప్పటికీ, వాటిని ఆచరణలో పెట్టే విషయంలో అనేక సవాళ్లు ఉన్నాయని ఇండియన్ యూనివర్సిటీ జీవకారుణ్యం సంస్థ ప్రతినిధులు తెలిపారు. బర్త్ కంట్రోల్ ఆపరేషన్లు కూడా SOP ప్రకారం అత్యంత జాగ్రత్తగా చేయాలని, ఆపరేషన్ సరిగా జరగకపోవడం వల్లే చాలా సమస్యలు వస్తున్నాయని వారు తెలిపారు. ప్రభుత్వం ఈ మార్గదర్శకాలను అమలు చేసే విషయంలో నిధులు, వసతుల కల్పనపై స్పష్టమైన ప్రణాళికతో ముందుకు రావాలని ఇండియన్ యూనివర్సిటీ జీవకారుణ్యం సంస్థ ప్రతినిధులు కోరారు.వీధి కుక్కలకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల అమలు తీరుపై ఇండియన్ యూనివర్సిటీ జీవకారుణ్యం సంస్థ ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో సంస్థ ప్రతిహినిధులు మాట్లాడుతూ సుప్రీంకోర్టు మార్గదర్శకాలను స్వాగతిస్తున్నప్పటికీ, వాటిని ఆచరణలో పెట్టే విషయంలో అనేక సవాళ్లు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా, బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్ల నుండి తరలించాల్సిన కుక్కలకు ఆపరేషన్లు పూర్తయ్యాక, వాటిని తరలించడానికి షెల్టర్లు ఎక్కడా లేవు అని అన్నారు. కుక్కలకు కల్పించాల్సిన ఐదు రకాల స్వేచ్ఛలు ఆహారం, వైద్యం, సురక్షిత ఆశ్రయం, స్వేచ్ఛగా జీవించడం కల్పించాలంటే, వాటి దాణా, వైద్య సౌకర్యాలకు భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుందని అన్నారు. బర్త్ కంట్రోల్ ఆపరేషన్లు కూడా SOP ప్రకారం అత్యంత జాగ్రత్తగా చేయాలని, ఆపరేషన్ సరిగా జరగకపోవడం వల్లే చాలా సమస్యలు వస్తున్నాయని వారు తెలిపారు. ప్రభుత్వం ఈ మార్గదర్శకాలను అమలు చేసే విషయంలో నిధులు, వసతుల కల్పనపై స్పష్టమైన ప్రణాళికతో ముందుకు రావాలని ఇండియన్ యూనివర్సిటీ జీవకారుణ్యం సంస్థ ప్రతినిధులు కోరారు.

