గో బ్యాక్.. గో బ్యాక్.. అమిత్ షా
1 min readడాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా ఆంధ్ర పర్యటనను నిరసిస్తూ ఎమ్మిగనూరు వామపక్షాల నిరసన
పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు : పట్టణంలో హోం శాఖ మంత్రి అమిత్ షా. పార్లమెంట్ సమావేశాలలో భారత రాజ్యాంగ నేత బిఆర్ అంబేద్కర్ గారిని అవమానించే విధంగా మాట్లాడినందుకు క్షమాపణలు చెప్పాలని నిసిగ్గుగా రాష్ట్రంలో పర్యటించడం రాష్ట్ర ప్రజలను అవమాన పరచడమే నని హోం మంత్రి. అమిత్ షా రాష్ట్ర పర్యటనను వ్యతిరేకిస్తూ ఎమ్మిగనూరు పట్టణంలో వామపక్ష పార్టీలు సిపిఐ సిపిఎం సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో సోమప్ప సర్కిల్ నందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి భాస్కర్ యాదవ్ సి ఐటియు డివిజన్ కార్యదర్శి బి.రాముడు సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ డివిజన్ కార్యదర్శి పి ప్రసాద్ ఏఐటీయూసీ తాలూకా కార్యదర్శి తిమ్మగురుడు వారు దేశ ప్రధాని నరేంద్ర మోడీ దేశంలో కార్పెట్ సంస్థలైన అంబానీ ఆదానిలకు ఊడి గం చేస్తూ భారత రాజ్యాంగాన్ని తిరిగి రాయాలని ప్రయత్నాలు చేయడం దుర్మార్గమే చర్యని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా భారత రాజ్యాంగ నేత అంబేద్కర్ గారిని అవమానపరిచే విధంగా మాట్లాడడం జరిగిందని తక్షణమే కేంద్ర మంత్రి పదవి నుంచి భర్తరఫ్ చేయాలని, బిజెపి దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని,మరోసారి ఇలాంటి ఘటనలు, మాటలు మాట్లాడకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పై నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం తాలూకా గౌరవాధ్యక్షులు కేసి జబ్బర్ పి.డి. యస్ యు జిల్లా కార్యదర్శి మహేంద్ర, సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి సమీవుల్లా, కాజా, హుద్దూస్ రవికుమార్, రాజన్న, ఆనంద్ ,అగస్టీన్, ఇస్మాయిల్ మహబూబ్ బాషా,ఎల్లప్ప, వీరేష్ తదితరులు పాల్గొన్నారు.