ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి రోజున సామూహిక వివాహాలు…
1 min readపోస్టర్లు ఆవిష్కరించిన ఆలూరు తెదేపా ఇంచార్జ్ బి వీరభద్ర గౌడ్
పల్లెవెలుగు వెబ్ హొళగుంద: భారత రాజ్యాంగ నిర్మాత దళిత దీన జన బంధువు భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి జన్మదిన సందర్భంగా ఏప్రిల్ నెల 14వ తేదీన హొళగుందలో కుల మతాలకు అతీతంగా సామూహిక వివాహాలు నిర్వహిస్తున్నట్లు నాయకులు పంచకుండగ వెంకటేష్ , కన్నారావు తెలిపారు. శనివారం ఆలూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ బి వీరభద్ర గౌడ్ చేతులమీదుగా సామూహిక వివాహాల పోస్టర్ ను ఆవిష్కరింప చేశారు. ఈ సందర్భంగా వీరభద్ర గౌడ్ మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా సామూహిక వివాహాలు ఒక మంచి కార్యక్రమమని ప్రస్తుతం పెళ్లిళ్లు పేద మధ్యతరగతి ప్రజలకు భారంగా మారాయని పెళ్లి చేయాలంటే అప్పు తప్పనిసరి అన్నట్లుగా పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. ఇటువంటి పరిస్థితులలో ఒక మంచి ఆలోచన విధానంతో పేద మధ్యతరగతి ప్రజలకు అండగా నిలిచేలా సామూహిక వివాహాల కార్యక్రమం నిర్వహణకు ముందుకు రావడం అభినందనీయమని తెలిపారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ పెద్దల దాతృత్వంతో… నాయకుల వితరణ నంది పుచ్చుకొని… స్నేహితుల సహకారంతో ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు కార్యక్రమం నిర్వహణకు ప్రతి ఒక్కరు తోడ్పాటు సహకారం ఎంతో అవసరమని ఈ సామూహిక కార్యక్రమంలో పెళ్లి చేసుకున్న వారు తమ పైన ఆర్థిక భారం అప్పులు లేకుండా జీవించేందుకు అవకాశం ఉందని, వారు ప్రతి సందర్భంలో కూడా తమకు మంచి చేసిన వారిని తలుచుకునే పరిస్థితులు ఉంటాయని కాబట్టి ఈ మంచి కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ తోడ్పాటు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ డివిజన్ అధ్యక్షులు వెంకటేష్, మాల మహానాడు జిల్లా నాయకులు వన్నూరప్ప బుడగ జంగాల నాయకులు రామాంజనేయులు నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్ ఆలూరు తాలూకా అధ్యక్షుడు రామాంజనేయులు ఉపాధ్యక్షులు నరసప్ప కోగిల తోట మాజీ సర్పంచ్ గోవర్ధన్ హోలగుంద మండల ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు వీరేష్ కోగిల తోట బసవరాజ్ వాల్మీకి యువ నాయకుడు గొర్రెల శ్రీనివాసులు తేజ న్యూస్ రిపోర్టర్ ఎన్ ఎస్ అరుణ్ కుమార్ దళిత నాయకులు సినిమా మంగన్న ముత్తయ్య రంగప్ప రామచంద్ర తదితరులు పాల్గొన్నారు.