సామూహిక వివాహాలు పోస్టర్లు ఆవిష్కరించిన పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ గౌడ్
1 min readపల్లెవెలుగుచ వెబ్ హొళగుంద;- భారత రాజ్యాంగ నిర్మాత దళిత దీన జన బంధువు భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి జన్మదిన సందర్భంగా ఏప్రిల్ నెల 14వ తేదీన హొళగుందలో కుల మతాలకు అతీతంగా సామూహిక వివాహాలు నిర్వహిస్తున్నట్లు నాయకులు పంచకుండగ వెంకటేష్ , కన్నారావు తెలిపారు. శనివారం హొళగుంద లో గ్రామపంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ గౌడ్, గ్రామ సర్పంచ్ చలవాది రంగమ్మ తనయుడు చలువాది పంపాపతి చేతులమీదుగా సామూహిక వివాహాల పోస్టర్ ను ఆవిష్కరింప చేశారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ గౌడ్ మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా సామూహిక వివాహాలు ఒక మంచి కార్యక్రమమని ప్రస్తుతం పెళ్లిళ్లు పేద మధ్యతరగతి ప్రజలకు భారంగా మారాయని పెళ్లి చేయాలంటే అప్పు తప్పనిసరి అన్నట్లుగా పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. ఇటువంటి పరిస్థితులలో ఒక మంచి ఆలోచన విధానంతో పేద మధ్యతరగతి ప్రజలకు అండగా నిలిచేలా సామూహిక వివాహాల కార్యక్రమం నిర్వహణకు ముందుకు రావడం అభినందనీయమని తెలిపారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ పెద్దల దాతృత్వంతో… నాయకుల వితరణ నంది పుచ్చుకొని… స్నేహితుల సహకారంతో ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు కార్యక్రమం నిర్వహణకు ప్రతి ఒక్కరు తోడ్పాటు సహకారం ఎంతో అవసరమని ఈ సామూహిక కార్యక్రమంలో పెళ్లి చేసుకున్న వారు తమ పైన ఆర్థిక భారం అప్పులు లేకుండా జీవించేందుకు అవకాశం ఉందని, వారు ప్రతి సందర్భంలో కూడా తమకు మంచి చేసిన వారిని తలుచుకునే పరిస్థితులు ఉంటాయని కాబట్టి ఈ మంచి కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ తోడ్పాటు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ డివిజన్ అధ్యక్షులు వెంకటేష్, దళిత సమాఖ్య మండల అధ్యక్షుడు నల్ల మల్లేష్ నాయకులు దేవేంద్ర, రుతి, తప్పేట మల్లికార్జున కొమ్ము సాయిబేష్ సినిమా మంగన్న ముత్తయ్య రంగప్ప రామచంద్ర తదితరులు పాల్గొన్నారు.