అమిత హాస్పిటల్ కు ‘ఆరోగ్య శ్రీ’ గుర్తింపు
1 min readఆస్పత్రి ఎం.డి. కృష్ణ మావి చాపే
పల్లెవెలుగు వెబ్ కర్నూలు : స్థానిక ఎన్ఆర్ పేటలోని అమిత హాస్పిటల్ కు ఎన్టీఆర్ ఆరోగ్య శ్రీ కింద వైద్య సేవలు అందించేందుకు గుర్తింపు లభించినట్లు ఆస్పత్రి ఎం.డి. కృష్ణ మావి చాపే తెలిపారు. శనివారం ఆయన ఆస్పత్రిలో విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 13న హాస్పిటల్ కు ఎన్టీఆర్ వైద్య సేవ గుర్తింపు ఇస్తూ ఆరోగ్య శ్రీ ట్రస్టు సీఈఓ ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ఆరోగ్య శ్రీ వైద్య సేవల కింద గర్భిణీలకు ఆపరేషన్లు, పురిటి మరియు చిన్న పిల్లల ఆపరేషన్లు, ఎముకలు, యాక్సిడెంట్ కేర్, చెవి, ముక్కు, గొంతు ఆపరేషన్లు, అపెండిక్స్, ఫైల్స్ తదితర ఆపరేషన్లు, కిడ్నీలో రాళ్లు, డయాలసిస్, మూత్ర నాళ సమస్యలు, ప్లాస్టిక్ సర్జరీ తదితర వైద్య సేవలు తమ హాస్పిటల్లో అందిస్తున్నామని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా అమిత హాస్పిటల్ ఎం.డి. కృష్ణ మావి చాపే వెల్లడించారు. ప్రతి రోజు జనరల్ ఫిజిషియన్ ద్వారా ఉచిత వైద్య సేవలు అందిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.