జాతీయ డిబేట్ లో రిడ్జ్ పాఠశాల విద్యార్థి ప్రతిభ
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: స్థానిక లక్ష్మీపురం సమీపంలోని రిడ్జ్ పాఠశాలలో నాలుగవ తరగతి చదువుతున్నటువంటి జి. ఆద్యశ్రీ సాయి స్కంద ఇండియన్ డిబేటింగ్ లీగ్ మరియు ఐఐటి చెన్నై ఆరేటరి క్లబ్ వారు సంయుక్తంగా నిర్వహించిన పోటీలలో అద్భుత ప్రతిభ కనపరచి సెమీఫైనల్స్ కు చేరుకున్నారు.జనవరి 26 రిపబ్లిక్ డే రోజు ఐఐటి చెన్నైలో జరిగే పోటీలకు అర్హత సాధించారని పాఠశాల ప్రిన్సిపల్ రాజ్ కమల్ తెలిపారు. పోటీలలో పాల్గొనే విద్యార్థినికి పాఠశాల సీ.ఈ.ఓ గోపినాథ్ , కొ-సీ.ఈ.ఓ సౌమ్య గోపీనాథ్ మరియు డీన్ రాజేంద్రన్ అభినందనలు తెలియజేశారు. చెన్నైలో జరిగే డిబేటింగ్ పోటీలలో కూడా అద్భుత ప్రతిభను కనబరచాలని తమ ఆకాంక్షను వెలిబుచ్చారు.