ఉప్పలదడియలో..ఇటలీ దేశస్థులకు ఘన స్వాగతం
1 min readదివ్య బలిపూజ సమర్పించిన బిషప్ గోరంట్ల జ్వాన్నేష్
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు (నందికొట్కూరు): నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలో గ్రామంలో ఆదివారం సాయంత్రం ఇటలీ దేశం రోమ్ నగరం నుండి వచ్చిన ఫాదర్ గాబ్రియేల్,జాన్ లూకా మరియు ఆర్.సీ.యం బిషప్ గోరంట్ల జ్వాన్నేష్ కు పునీత యోహాను దేవాలయంలో (ఆర్సీఎం చర్చి) విచారణ గురువులు ఫాదర్ డి.మధు బాబు ఆధ్వర్యంలో విచారణలోని 10 గ్రామాల ప్రజలు ఘన స్వాగతం పలికారు.దివ్య బలి పూజను బిషప్ సమర్పించారు.దేవుని అడుగుజాడల్లో నడిచేందుకు ప్రతి ఒక్కరూ ముందు ఉండాలని దేవునికి విరుద్ధమైన పనులు చేయకూడదని మనలో ఉన్న చెడు తలంపులను తీసివేయాలని అదే విధంగా ఏసుప్రభు మనలో ఉంటే మన కుటుంబాల్లో శాంతి సమాధానాలు ఉంటాయని బిషప్ అన్నారు.దివ్య సత్ప్రసాద అప్పమును విశ్వాసులకు అందజేశారు. చివరగా బిషప్ ని మరియు ఇటలీ దేశస్థులను వివిధ గ్రామాల ప్రజలు శాలువాలు పూల మాలలతో ఘనంగా సత్కరించారు. ఉప్పలదడియ,కలమందల పాడు,మాసపేట,కడుమూరు, చౌటుకూరు,49 బన్నూరు, దేవనూరు,పైపాలెం,కేతవరం దిగువపాడు గ్రామాల నుండి విశ్వాసులు అధిక సంఖ్యలో పూజలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో బ్రదర్ థోమాస్, ఆనిమేటర్లు చిన్నప్ప, బాలస్వామి విచారణ పెద్దలు ఆనందరావు,పక్కిరయ్య, ఏసన్న,ఈరన్న,హరి,డేవిడ్, జానయ్య,సిద్దయ్య,స్వామి దాసు తదితరులు పాల్గొన్నారు.