డోన్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా కొట్రికే హరికిషన్
1 min readపల్లెవెలుగు వెబ్ ప్యాపిలి: డోన్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా కొట్రికే హరికిషన్ను ఎన్నుకున్నందుకు రాష్ట్ర అర్చక సమైక్య కమిటీ డోన్ తాలూకా అర్చక సమైక్య కమిటీ తాలూకా ప్రధాన కార్యదర్శి ఏఈ నాగరాజు గౌడ్ మరియు నంద్యాల జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ వనం లక్ష్మీదేవి ఆధ్వర్యంలో హరి కిషన్ ని ఘనంగా సన్మానించి అమ్మవారి స్వామివారిని చిత్రపటంలను అందజేయడం జరిగినది. ఈ సందర్భంగా ఏఈ నాగరాజు మాట్లాడుతూ కర్నూలు నంద్యాల జిల్లాలకు ఆదర్శం లోన్ కోట్రికే కుటుంబం లోన్ జడ్పీహెచ్ఎస్ బాలికల ఉన్నత పాఠశాలకు 1500 కోట్ల రూపాయలు విలువ చేసి స్థలంలో దానం చేసి వేలాదిమంది విద్యార్థులకు సౌకర్యాన్ని కల్పించారు. అదేవిధంగా శ్రీరాముల దేవాలయమునకు 1000 కోట్ల విలువచేసే స్థలంలో కేటాయించి ఆదర్శప్రాయులయ్యారు స్వర్గీయ మాజీ ఎమ్మెల్యేవెంకట శెట్టి మనవడు హరికిషన్ను రెండవసారి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా ఎన్నుకోవడం మంచితనం అనిఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలోడోన్ తాలూకా అర్చక సమైక్య అధ్యక్షులు ముక్తేశ్వర స్వామి ఆలయ ప్రధాన అర్చకులు మల్లికార్జున స్వామి , ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ నాయకులు హరీష్ , కటిక సంఘం నాయకులు లక్ష్మీకాంత్ , దళిత సామాజిక సేవ సంఘం నాయకులు గేట్ రాజు, బీసీ సంక్షేమ సంఘం మహిళా నాయకురాలు సునీత తదితరులు పాల్గొన్నారు.