ఆర్టీసీ మేనేజర్ అమర్నాథ్ బదిలీ .. కొత్త మేనేజర్ గా మదిలేటి నాయుడు బాధ్యతలు
1 min readపల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు: పట్టణంలో ఏపీఎస్ఆర్టీసీ ఎమ్మిగనూరు డిపో నందు 19 నెలలుగా ఇన్చార్జి డిపో మేనేజర్ గా పని చేస్తున్న బి. అమర్నాథ్ ఈరోజు రిలీవ్ కావడం జరిగింది. ఒకేసారి డి.ఎం. బి అమర్నాథ్ వీడ్కోలు చెబుతూ కొత్తగా వచ్చిన డి.ఎం. సి మదిలేటి నాయుడు ను స్వాగతం పలుకుతూ పూలమాలలతో మరియు శాలువాతో ఇరువురిని నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ డిపో కమిటీ వీడ్కోలు, స్వాగతాన్ని కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. బి .అమర్నాథ్ మదనపల్లి 2 డిపోకు బదిలీ చేయడం తో ఆయన సోమవారం రిలీవ్ అయ్యారు. ఆయన స్థానంలో ఇన్చార్జి డిపో మేనేజర్ గా ఇప్పటివరకు నంద్యాల డిపో సిఐగా పనిచేస్తున్న సీ. మద్దిలేటి నాయుడు ఎమ్మిగనూరు ఇన్చార్జి డిఎం గా ఛార్జ్ తీసుకున్నారు. అమర్నాథ్ రిలీవ్ కావడం సీ. మదిలేటి నాయుడు చార్జ్ తీసుకోవడం ఒకేసారి జరిగాయి. ఈ సందర్భంగా బి.అమర్నాథ్ మాట్లాడుతూ ఎమ్మిగనూరు డిపోకు కొత్తగా వచ్చిన డిఎం ను కూడా నాకు సహకరించినట్లే సహకరించాలని కోరారు. ఇదే సందర్భంగా కొత్తగా వచ్చిన డీ. ఎం. సీ. మద్దిలేటి నాయుడు కూడా డిపో అభివృద్ధికి అందరూ కృషి చేయాలని ఏవైనా విషయాలపై తమరికి ఎటువంటి డౌటున్న వెంటనే నన్ను కలవాలని ఆ ప్రాబ్లం ను సాల్వ్ చేసేదాకా నేను వదిలేది లేదని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో నేషనల్ మద్దూర్ యూనిటీ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఎస్. ఎం. రఫిక్,మూస్తాక్ అహ్మద్, లతోపాటు ఎన్. పి. ఎం.సాహెబ్, ఎల్. బి.నవాజ్, ఎస్. ఎం. బాషా, రహంతుల్లా, కేశవులు, ఖాసీం, ఖాజవాలి,నాగరాజు, బి. ఎం. స్వామి, కె. చాంద్ పాషా, బి.కంచన్నా, యునుస్, యు.ఎల్లాప్ప, రిటైర్డ్ ఎంప్లాయిస్ యు.గోపి, సి ఎం డీ దావూద్,నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ సభ్యులు అధిక సంఖ్యలో తదితరులు పాల్గొన్నారు.